టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ కు ప్రత్యేక స్థానం ఉంది.. అయన సినిమాలు ఫ్లాప్ అయినా సరే అయన క్రేజ్ ఏమాత్రం తగ్గదు. హిట్ అయితే మాత్రం అయన అభిమానులు ఆగరు. గత కొన్ని సినిమాలుగా బాలకృష్ణ  అభిమానులను నిరాశపరుస్తూనే వస్తున్నారు.. దాంతో  బోయపాటి శ్రీను తో మరో సినిమా చేసి హిట్ కొట్టాలని ఆయనదర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. BB3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇద్దరికీ తప్పక హిట్ పడాల్సిన సినిమా కావడంతో ఎంతో జాగ్రత్తగా సినిమాపై నిర్ణయాలు తీసుకుంటున్నారు..