ఈ మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో తరుచుగా భూకంపాలు సంభవించడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా మరోసారి ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. మణిపూర్ లో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలు పై 5.5 గా నమోదు అయింది. దీని వలన ఆస్తి ప్రాణ నష్టం ఇంకా తెలియలేదు.

 

అసోం మేఘాలయ గౌహతి మణిపూర్ లో భూమి కంపించింది. చైనా సరిహద్దు గ్రామాల్లో కూడా భూకంపం వచ్చినట్టు సమాచారం. దీనితో ప్రజలు అందరూ కూడా రోడ్ల మీదకు పరుగులు తీసారు. ఆరు సెకన్ల పాటు భూమి కంపించిందని అధికారులు మీడియాకు వెల్లడించారు. మిజోర౦ లో కూడా స్వల్పంగా భూమి కంపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: