
హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. .రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్ సాగర్ సమీపంలో హత్య జరిగింది. దుండగులు బండరాయితో మోది యువతిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు ఘటన జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చేరుకుని కేసు నమోదు చేశారు.
పోలీసులు హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగినిని ఎవరు హత్య చేశారు...? హత్య చేయడానికి గల కారణాలు ఏమిటి...? అనే విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. మృతురాలికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.