భారత్ లో కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతుండడంతో ఇతర దేశాలు భారత్ వైపు సరిహద్దులను మూసి వేస్తున్నాయి. తాజాగా పర్యాటక ప్రాంతం అయిన మాల్దీవులు కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది. మే 13 నుండి భారత్ సహ దక్షిణాసియా దేశాల నుండి వచ్చే పర్యటకులపై నిషేదం విధించింది. ఈ విషయాన్ని మాల్దీవులు ఇమ్మిగ్రేషన్ విభాగం ట్విట్టర్ లో తెలిపింది.  " దక్షిణాసియా దేశాలకు చెందిన పర్యాటకులకు మాల్దీవుల్లోకీ ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని, ఈ నిబంధన అన్ని రకాల వీసా దారులకు వర్తిస్తుందని, ఈ విధానం మే 13 నుండి అమల్లోకి రానుందని " మాల్దీవులు ఇమ్మిగ్రేషన్ ట్విట్టర్లో నోట్ విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: