యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క‌థానాయ‌కుడిగా  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో రూపొందుతుంది. ఈ సినిమాపై అంచెనాలు  భారీగానే పెట్టుకున్నారు అభిమానులు.  ఇద్దరూ స్టార్ హీరోలతో.. జక్కన్న చేస్తున్న సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంత‌గానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిన‌దే. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, వీడియోలు, ట్రైల‌ర్ నెట్టింట్లో రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంది.
 
తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డం భాష‌ల్లో తెర‌కెక్కిస్తుండ‌డంతో ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌ను భారీగానే ప్లాన్ చేసింది చిత్ర బృందం. రోజుకొక చోట ప్రెస్‌మీట్ పెట్టి ప్రమోష‌న్స్ పెంచుతున్నారు. తాజాగా త‌మిళంలో ప్ర‌మోష‌న్ల సంద‌ర్భంగా రామ్‌చర‌ణ్ మాట్లాడుతూ.. సైరా విజయం నాకు ఆర్ఆర్ఆర్  భారీ విజ‌యం అందిస్తుంద‌నే న‌మ్మ‌కాన్ని ఇచ్చింద‌ని  రామ్‌చ‌ర‌ణ్ పేర్కొన్నారు. త‌మిళం అంటే నాకు ఎంతో ఇష్ట‌మని.. త‌మిళం కూడా కొన్ని క‌థ‌లు వింటున్నాన‌ని త్వ‌ర‌లో త‌మిళంలో సినిమా కూడా చేయ‌నున్న‌ట్టు చెప్పారు చ‌ర‌ణ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: