రాష్ట్రమంతటా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. భోగి మంటలతో ప్రజలు సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతున్నారు. అయితే.. టీడీపీ ఆధ్వర్యంలోనూ భోగి సంబరాలు జరుగుతున్నాయి. విజయవాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి భోగి మంటలు వేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ భోగి మంటలు వెలిగించి ప్రారంభించారు.


అయితే.. భోగి సంబరాల్లోనూ టీడీపీ తన మార్కు చూపించింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను భోగి మంటలతో తెలిపింది. టీడీపీ కార్యకర్తలు చెత్త పన్ను ప్లకార్డులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం దిగిపోవాలని నినాదాలు చేశారు. చెత్త పన్నును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ బిల్లుల జీవోలను ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఓటీఎస్ రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. మొత్తానికి సంక్రాంతి సంబరాల్లోనూ టీడీపీ తన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనను మాత్రం వదల్లేదన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: