హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని హోలిస్టిక్‌ ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. హోలిస్టిక్‌ ఆస్పత్రి గ్రౌండ్‌ ఫ్లోర్‌ మొత్తం మంటలు వ్యాపించాయి. మంటల కారణంగా ఆస్పత్రి మొత్తం పొగ వ్యాపించింది. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది రోగులను హుటాహుటిన వేరే ఆస్పత్రికి తరలించారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మూడు  అగ్నిమాపక వాహనాలతో మంటలార్పాయి.


హోలిస్టిక్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 70 మంది రోగులు ఉన్నట్టు సమాచారం. అయితే సకాలంలో స్పందించడంతో రోగులకు ప్రాణాపాయం తప్పింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు సిబ్బంది భావిస్తున్నారు. అగ్ని ప్రమాదం విషయం తెలియగానే ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆస్పత్రి వద్దకు చేరుకుని సహాయ చర్యలు పర్యవేక్షించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వివరించారు. సిబ్బంది సకాలంలో స్పందిచకపోయినా.. మంటలు అదుపులోకి రాకపోయినా భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: