ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇది మరికొన్ని నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. అయితే.. ఈ యుద్ధంలో చిక్కిన యుద్ధ ఖైదీలను రష్యా నిర్బంధించి చిత్రహింసలు పెడుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. యుద్ధ ఖైదీలను మాత్రమే కాకుండా సాధారణ ప్రజలను కూడా రష్యా నిర్బంధింస్తోందని ఉక్రెయిన్ మండిపడుతోంది. డొనెట్స్‌క్‌, లుహాన్స్‌క్‌ ప్రాంతంలో తమ పౌరులు మొత్తం 8 వేల మందిని నిర్బంధించారని ఉక్రెయిన్ ఆరోపించింది. అలాగే ప్రస్తుతం డాన్‌బాస్‌ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకోవడమే లక్ష్యంగా రష్యా సైన్యాలు ఉక్రెయిన్‌పై
ముప్పేట దాడిగా విరుచుకుపడుతున్నాయి. తూర్పు డాన్‌బాస్‌, లుహాన్స్‌క్‌ ప్రాంతంలోని 40 చిన్న చిన్న పట్టణాలపైనా రష్యా సైన్యాలు దాడులు చేస్తున్నాయట. ఇలా దాడి చేసిన మాస్కో సేనలు సెవెరోడొనెట్స్‌క్‌, లైసింఛాన్స్‌క్ నగరాలను ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. డొనెట్స్‌క్‌, లుహాన్స్‌క్‌ ప్రాంతంలో 8 వేల మందిని ఉక్రెయిన్ నిర్బంధించిందని  ఉక్రెయిన్ అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: