చైనా భారత సరిహద్దుల్లో ఓ గ్రామం నిర్మిస్తోందన్న వార్త ఇప్పుడు రెండు దేశాల మధ్య కొత్త వివాదానికి దారి తీసింది. భారత్‌లోని అమోచూ ప్రాంతంలో ఈ గ్రామాన్ని చైనా నిర్మించింది. భారత్‌కు అత్యంత కీలకమైన డోక్లాం పీఠభూమి శిఖరాలపైకి చేరుకోవడం ఇక్కడి నుంచి ఎంతో తేలిక అని తెలుస్తోంది. ఒక వేళ చైనా సైన్యం ఇక్కడకు చేరుకుంటే.. భారత్‌లోని కీలకమైన సిలుగుడి కారిడార్‌ ను టార్గెట్ చేయడం చైనాకు చాలా సులువు అవుతుందన్న అంచనాలు ఉన్నాయి.


సిలుగిడి కారిడార్‌ను టార్గెట్ చేయడం కోసం చైనా ఇలాంటి ఎత్తులు వేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. భద్రతా పరంగా ఈ కారిడార్‌ భారత్‌కు అత్యంత సున్నితమైందని చెబుతారు. అంతే కాదు.. ఈశాన్య రాష్ట్రాలను భారత్‌లోని మిగిలిన భూభాగాలను కలిపేది ఈ సిలుగుడి కారిడార్‌. అందుకే చైనా ఎంతో కీలకమైన ఆ ప్రాంతంపై కన్నేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చైనా గ్రామం నిర్మిస్తున్న ప్రాంతంలో ఒక వంతెన కూడా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: