విజయవాడ పోరంకిలోని శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ నీట్ సీట్లలో రికార్డులు సృష్టిస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. గత 6 ఏళ్లలో 5 వేల మందికి పైగా డాక్టర్లుగా తయారు చేసిన నార్త్ ఇండియన్ అధ్యాపక బృందం శిక్షణతో   సాధారణ విద్యార్థులను సైతం డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్నట్లు అకాడమీ ఛైర్మన్ నరేంద్రబాబు తెలిపారు. అకాడమీ ప్రారంభించిన తొలి ఏడాదిలోనే నీట్ 2021 లో  725మంది విద్యార్థులు  మెడికల్ సీట్లు సాధించి అద్భుతాలు నమోదు చేసినట్లు నరేంద్రబాబు తెలిపారు.  


ప్రతి క్లాస్ రూమ్ ను డిజిటలైజ్ చేసి , స్మార్ట్ బోర్డు ద్వారా వందశాతం డిజిటల్ బోధన చేస్తోన్న ఏకైక సంస్థగా తమ అకాడమీ గుర్తింపు పొందినట్లు నరేంద్రబాబు  తెలిపారు. ఈ ఏడాది 2400 మంది  అకాడమీ లో నీట్ పరీక్షలకు శిక్షణ పొంది పరీక్షలు రాశారన్న నరేంద్రబాబు.. అత్యధిక సంఖ్యలో నీట్  మెడికల్  సీట్లు సాధించబోతున్నట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: