సంక్రాంతికి ప్రేక్షకుల‌కు వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వ‌స్తున్న బాల మావ‌య్య, వాల్తేరు వీర‌య్యగా వ‌స్తున్న చిరంజీవి గారికి శుభాకాంక్షలు అంటున్నారు నారా లోకేశ్‌ . అల‌రించే పాట‌లు, ఆలోచింప‌జేసే మాట‌లు, ఉర్రూత‌లూగించే డ్యాన్సుల‌తో పూర్తిస్థాయి వినోదం అందించే ఈ చిత్రాల‌ను కోట్లాది ప్రేక్షకుల‌లో ఒక‌డిగా నేనూ చూడాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నానని నారా లోకేశ్ తెలిపారు.


అయితే.. హీరోల పేరుతో, కులాల పేరుతో ఫేక్ పోస్టులు సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ స‌న్నద్ధమైందని నారా లోకేశ్ ఆరోపించారు. ఇద్దరు అగ్రహీరోల సినిమాలు విడుద‌లవుతున్న సంద‌ర్భాన్ని వాడుకుని సోష‌ల్మీడియాలో ఫేక్‌ ఖాతాల ద్వారా ఒక కులం పేరుతో మ‌రో కులంపై విషం చిమ్మాల‌ని కుట్రలు ప‌న్నారని నారా లోకేశ్ అంటున్నారు. విష‌ప్రచారాలు చేసి కుల‌, మ‌త‌, ప్రాంతాల మ‌ధ్య విద్వేషాలు ర‌గిల్చిన దుష్ట చ‌రిత్ర గ‌లిగిన వారి ట్రాప్‌లో ఎవ‌రూ ప‌డొద్దని నారా లోకేశ్ సూచించారు. సినిమాలు అంటే వినోదం... సినిమాల‌ను వివాదాల‌కు వాడుకోవాల‌నే అధికార పార్టీ కుతంత్రాల‌ను తిప్పికొడ‌దామని నారా లోకేశ్ అన్నారు. మ‌న‌మంతా ఒక్కటే  కులం మ‌తం ప్రాంతం ఏవీ మ‌న‌ల్ని విడ‌దీయ‌లేవంటూ నారా లోకేష్ పోస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: