
విమానం వెళ్తుంటూనే డోర్ తీస్తే ఎంత ప్రమాదకరం.. తాజాగా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. విమానంలో అత్యవసర ద్వారం తెరిచి ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతేడాది డిసెంబరు 10న చెన్నై - తిరుచిరాపల్లి ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగిందట. విమానం టేకాఫ్‌కు సిద్ధమైన సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారట.
అయితే.. అప్రమత్తమైన సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు. విమానం లోపల పీడనం సరిచూసుకుని, ఇతర తనిఖీల అనంతరం విమానం బయల్దేరింది. అయితే.. ఈ వ్యవహారంపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. ఎయిరిండియా విమానంలో ఇటీవల తరచూ వివాదాస్పద ఘటనలు జరుగుతున్నాయి. ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన, భోజనంలో రాళ్లు.. మద్యం మత్తులో టాయిలెట్‌లో పొగతాగడం వంటి ఘటనలు జరిగాయి. ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని డీజీసీఏ వార్నింగ్ ఇచ్చింది.