కేసీఆర్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కుమ్మక్కయ్యారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పరోక్షంగా ఆరోపిస్తున్నారు. కిషన్‌ రెడ్డి సొంత గ్రామంలోని భూదాన్‌ భూములను కేసీఆర్‌ ఫ్యామిలీ కొట్టేస్తుంటే.. కేంద్ర మంత్రి ఎందుకు నోరు మెదపడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తన గ్రామంలోని భూదాన భూములపై అప్పట్లో లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మిన్నకుండి పోయారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కిషన్ రెడ్డికి తాను రాసే లెటర్‌తోపాటు గతంలో కలెక్టర్‌కు ఆయన రాసిన కిషన్ రెడ్డికి లేఖను కూడా జతచేస్తూ రాయనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ పాలనలో పారదర్శకంగా భూ రికార్డులు ఉండేవని వాటిని డిజిటలైజ్‌ చేసేందుకు అప్పట్లోనే ప్రయోగాత్మకంగా చేపట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. కలెక్టర్లు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి ఎందుకు లేఖ రాయడం లేదని రేవంత్ రెడ్డి  ప్రశ్నించారు. మేడ్చల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో భూములపై విచారణ జరిపిస్తామన్నారు. అప్పుడు కలెక్టర్లు కాంగ్రెస్‌ ప్రభుత్వ రాగానే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి  హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr