ఆరోగ్యశ్రీ క్యాన్సర్‌ ఆస్పత్రులను హోమీబాబా క్యాన్సర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాన్సర్‌ గ్రిడ్‌కు అనుసంధానం చేయాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీనివల్ల ఏ ప్రాంతంలో ఎలాంటి, ఎక్కువ క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయో ప్రభుత్వానికి తెలుస్తుంది. ఏపీ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న అన్ని క్యాన్సర్‌ ఆస్పత్రుల్లో పాలియేటివ్‌ కేర్‌ కోసం 5 శాతం పడకలను కచ్చితంగా కేటాయించనున్నారు. ఐబ్రిస్ట్‌ స్క్రీనింగ్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు.

అంతే కాదు.. రూ.10వేల ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి ఉచిత బస్‌పాస్‌లు అందజేయనున్నారు. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుతో పాటు, పలాసలో కిడ్నీ కేర్‌ సెంటర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. పిడుగురాళ్ల, పులివెందులలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించనున్నారు. అక్కడ టీచింగ్‌ ఆస్పత్రుల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: