కేసీఆర్ ఒక  రాజాబాబు అని తెలంగాణలో కుటుంబ పాలన చేస్తున్నారని బీజేపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మండిపడ్డారు. గతంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకునే కేటీఆర్ ఇప్పుడు మంత్రి అయ్యారని.. ప్యాలెస్ లో ఉండి ప్రజా పాలన పక్కనపెట్టి ప్రజలను దోచుకుంటున్నారని తరుణ్ చుగ్ దుయ్యబట్టారు. పదవులు కుటుంబ సభ్యులకే ఇచ్చుకున్నారని.. తెలంగాణ కోసం పోరాడిన వారికి మీరు ఏం చేశారని తరుణ్ చుగ్ నిలదీశారు. దేశంలో భూమాఫియా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ వన్ లో ఉందన్న తరుణ్ చుగ్.. దీని వెనుక కేసీఆర్ హస్తం ఉందన్నారు.

నిరుద్యోగుల సమస్యలపై తాము చేస్తున్న పోరాటంతోనైనా కేసీఆర్ సర్కార్ నిద్రలేవాలని  తరుణ్ చుగ్ అన్నారు. చెవిటి, గుడ్డి ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాలన్న తరుణ్ చుగ్.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని ఏది కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఈ నవంబర్ తో తెలంగాణకు పట్టిన కేసీఆర్ అనే మకిలి వీడుతుందని తరుణ్ చుగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు పడక గదుల ఇళ్లు, దళిత బంధు ఏది కేసీఆర్ ఎందరికి ఇచ్చారని తరుణ్ చుగ్ ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: