ఇప్పుడు కృత్రిమ మేధ అన్ని రంగాల్లోనూ అడుగు పెడుతోంది. రోబోలు ఆపరేషన్లు కూడా చేస్తున్నాయి. అయితే అక్కడక్కడా పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. తాజాగా దక్షిణ కొరియాలో ఓ రోబో మనిషిని చంపేసింది. ఓ వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీలో రోబో పనితీరును పరీక్షించటానికి ఓ వ్యక్తి వచ్చాడు. కూరగాయలతో ప్యాక్ చేసిన బాక్సులను కన్వేయర్ బెల్ట్ మీదికి చేర్చే రోబోను పరీక్షిస్తున్నాడు.
అయితే రోబోలోని సెన్సర్లలో సమస్య తలెత్తింది. దీంతో రోబో ఆ వ్యక్తిని కూడా కూరగాయాల బాక్సుగా భావించింది. అంతే.. అతడిని ఎత్తికన్వేయర్ బెల్ట్ మీద అదిమి పెట్టేసింది. దీంతో ఆ వ్యక్తి ముఖం, ఛాతీ భాగం తీవ్రంగా నలిగిపోయాయి. దాంతో ఒక్కసారిగా అంతా అలర్టయ్యారు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. గతంలోనూ దక్షిణ కొరియాలో ఇటువంటి ప్రమాదాలు జరిగాయట.
మరింత సమాచారం తెలుసుకోండి: