సౌందర్య ఉత్పత్తుల్లో ప్రస్తుతం లాక్మే ఇతర సంస్థలతో ఈ రిలయన్స్ బ్యూటీ అండ్ కేర్ టేక్ సంస్థ పోటీపడే అవకాశాలు ఉన్నాయి. 2022, 23 సంవత్సరంలో అరవింద సంస్థకు దాదాపు 336 కోట్ల రూపాయలు పెట్టుబడి ఉండేది. అయితే రాబోయే రోజుల్లో రిలయన్స్ సంస్థ బార్బర్ షాపులు రిలయన్స్ టాయిలెట్స్ పెట్టిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ బడా కార్పొరేట్ కంపెనీ వివిధ రంగాల్లో దూసుకుపోతూనే ఉంది. చెప్పుల దుకాణాల నుంచి కిరాణా షాపు పెట్రోల్ బంకులు ఆయిల్ పనిచేసే ఇలా ఎన్నో రకాలైనటువంటి వివిధ విభిన్న వ్యాపారాల్లో దూసుకుపోతోంది.
తద్వారా ప్రజలకు మరింత చేరువైంది ఇదే విధానంతో దూసుకుపోతే దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ సంస్థగా నిలిచేందుకు ఎక్కువ రోజులు పట్టే అవకాశం లేదు. అదే సమయంలో ఈ సంస్థలో పనిచేసే కార్మికులు కాస్త ఉద్యోగులుగా కూడా మారుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎక్కువ మందికి ఉపాధి కూడా లభిస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ తో కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి