
పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో వరుడి మనసులో ఒక వింత కోరిక పుట్టింది. దీంతో ట్విస్ట్ ఇచ్చాడు వరుడు. ఏకంగా యువతికి ఫోన్ చేసి ఒక కోరిక కోరాడు. తనకు ఇస్తానన్న కట్నం కాకుండా ఒక బైక్, అదనంగా అరవై వేల రూపాయలు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశాడు. లేదంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఇక ఏం చేయాలో తెలియక మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బీహార్ లోని భేటీయాలో వెలుగులోకి వచ్చింది.
బెట్టియకు చెందిన ముస్ఖాన్ అనే 22 ఏళ్ల యువతికి.. హుస్సేన్ అనే 25 ఏళ్ల యువకుడితో వివాహం కుదిరింది. పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. వరుడి కుటుంబం వారు అడిగినట్లుగానే లక్ష రూపాయలు కట్నంగా ఇవ్వడానికి వధువు తండ్రి అంగీకరించాడు. ఇక ఈ డబ్బులను ముందుగానే అందజేసాడు. అయితే ఇటీవలే ముస్కాన్ కు హుస్సేన్ ఫోన్ చేసి బైక్ తో పాటు అదనంగా 60 వేల రూపాయలు ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశాడు. లేదంటే పెళ్లి క్యాన్సిల్ అంటూ తెగేసి చెప్పాడు.. పెళ్లి క్యాన్సిల్ అనేసరికి ఇక సదరు యువతీ తీవ్రమైన మనస్థాపానికి గురైంది. దీంతో చివరికి ఆత్మహత్య చేసుకుంది. వధువు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.