ఈరోజుల్లో మానవసంబంధాలు మంటకలిసిపోతున్నాయి. విలువలు తగ్గిపోతున్నాయి.. తమకు కోరిక కలిగితే పక్కన ఉన్నది ఎవరో అని కూడా చూడట్లేదు. కన్న తల్లి ని సైతం వదలని కామాంధుల దుశ్చర్య ను మనం చూస్తూనే ఉన్నాం.. వావి వరసలు మరిచి కుటుంబ సభ్యులనే చెరిచేస్తున్న ఈ ఘటనలు రోజు రోజు కు పెరిగిపోవడంతో ఈ సమాజం ఎటువైపు కి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఇంట్లో వాళ్ళు బయటకి చెప్పుకునే పరువుపోతుందని భయపడిపోతుంటే ఈ కామాంధులు మరింత రెచ్చిపోతూ వారిలో సహనాన్ని పరీక్షిస్తున్నారు.. ఆడవారిపై ఈ అఘాయిత్యాలు రోజు రోజు కి ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వీరి ఆగడాలు ఎక్కువయిపోతున్నాయి.. ఆడది కనిపిస్తే అందుకే అన్నట్లు చూసే ఈ కళ్ళు ఇప్పుడు ఒకే మెట్టు ఎక్కి వారి జీవితాలని నలిపేయడానికి సిద్ధమవుతున్నారు. .