అమ్మో..ఆడాళ్లు మహా ముదురులు అయ్యారు.. ఒకప్పుడు పాపం అనుకునేవాల్లు..కానీ ఇప్పుడు మాత్రం వామ్మో అంటున్నారు. క్రైమ్ రేటులో ఎక్కువగా ఆడవాళ్ళు ఉన్నారని తెలుస్తుంది..గత రెండేళ్ళలో కరోనా ప్రభావం వల్ల ఇలా దొంగతనాలు లేదా మోసాలకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది..ఇప్పుడు ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువతి కరోనా కారణంగా ఉద్యొగాన్ని కోల్పోయింది..ఇక చెసెదెమి లేక దొంగగా మారి, చిన్న చిన్న  దొంగతనాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.అయితే ఇప్పుడు ఆమె అసలు వ్యవహారం బయట పడింది.


మంగళవారం మధ్యాహ్నం ఆమె బుర్ఖా ధరించి ముంబైలోని ఓ నగల దుకాణానికి వెళ్లింది...యజమాని ఆమెకు కొన్ని నగలు చూపించాడు.. ఆ సమయంలో ఆమె తన బ్యాగ్ నుంచి తుపాకీ తీసి అతనికి గురి పెట్టింది.. కింద కూర్చుని చేతులు మోకాళ్ల మీద పెట్టుకోవాలని ఆదేశించింది.. అయితే ఆ యజమాని వేగంగా ఆమె మీదకు దూకి తుపాకీ లాక్కుని షాకిచ్చాడు.వివరాల్లొకి వెళితే..ముంబైకి చెందిన రియా అనే యువతి కోవిడ్‌కు ముందు ఓ బార్‌లో పని చేసేది. లాక్‌డౌన్ సమయంలో ఆమె ఉద్యోగం పోయింది. దీంతో ఆమె కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న క్రైమ్‌లు చేసేది. మంగళవారం మధ్యాహ్నం విరార్‌లో ఉన్న దేవ్‌నారాయన్ జ్యువెలర్స్‌ షాప్‌లోకి వెళ్లింది. యజమాని దేవీలాల్ గుజార్ ఆమెకు కొన్ని నగలు చూపించాడు. ఆ సమయంలో రియా తన బ్యాగ్ నుంచి తుపాకీ తీసి గుజార్‌కి గురి పెట్టింది. కింద కూర్చుని చేతులు మోకాళ్ల మీద పెట్టుకోవాలని ఆదేశించింది..అతను వేగంగా స్పందించాడు.వెంటనే కౌంటర్ నుంచి ఆమె పైకి ఒక్కసారిగా దుకాడు..అనంతరం ఆమె బుర్ఖా లాగి బయటకు ఈడ్చుకెళ్లాడు. అదే సమయంలో బయట నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రియాను అదుపులోకి తీసుకున్నారు. రియా చూపించింది నిజమైన తుపాకీ కాదని, స్టీల్‌తో తయారు చేసిన సిగరెట్ లైటర్ అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు రియాను విచారిస్తున్నారు. కాగా, ఈ ఘటన మొత్తం షాప్‌లో అమర్చిన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది..ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: