
తెలుస్తున్న సమాచారం ప్రకారం భవ్యశ్రీ అనే 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థినికి నలుగురు యువకులు వెంటపడి లవ్ ప్రపోజ్ చేశారు. అయితే ఆమె ఎవరిని అంగీకరించలేదు. కానీ ఆ నలుగురిలో ఒకడు మాత్రం ఆమె ఒప్పుకోకపోయినా వెంటపడి మాయ మాటలు చెప్పి తన వలలో వేసుకున్నాడు. పాపం ఆ దుర్మార్గుడిని నమ్మి ప్రేమించి మోసపోయి దారుణంగా హత్య చేయబడింది భవ్యశ్రీ. ఒక రోజు ఆ అమ్మాయిని ఆ దుర్మార్గుడు తన బైక్ పై తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి బయటికి తీసుకెళ్లాడు. పాపం ఆమెని కనికరం లేకుండా చెట్టుకి కట్టేసి ఆ నలుగురు దుర్మార్గులు చాలా దారుణంగా రేప్ చేశారు.అంతటితో ఆగకుండా ఆమెని చాలా దారుణంగా టార్చర్ చేసి చంపేశారు. ఆమెకు అరగుండు కొట్టించి ఆమె కనురెప్పలు కత్తిరించి చాలా దారుణంగా ఉరి వేసి చంపి పక్కన చెరువు వద్ద వున్న బావిలో పడేసారు. స్థానికులు వినాయకుని నిమజ్జనం చేసేందుకు వెళ్ళినప్పుడు ఆమె మృత దేహాన్ని చూశారు.ఆ శవం ఆమెదే అని తెలియడంతో ఆమె తల్లిదండ్రులు గుండె పగిలేలా కన్నీరుమున్నీరవుతున్నారు. న్యాయం కోసం పోరాడుతున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈ కేసు చాలా ఆలస్యంగా బయట పడింది.
దేశంలో రోజు రోజుకు ఇలాంటి దారుణమైన సంఘటనలు వేలల్లో జరుగుతున్నాయి.అందులో కొన్ని బయట పడుతుంటే కొన్ని వేల సంఘటనలు మాత్రం ఇంకా తెలియకుండా పోతున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్ల బాధితుల కుటుంబాలకు న్యాయం జరగట్లేదు.రాజకీయ నాయకుల అండ చూసుకొని నిందితులు రెచ్చిపోతున్నారు. మన దేశ చట్టంలో కఠినమైన శిక్షలు లేనందువల్లే ఇలాంటి రాక్షసులు రెచ్చిపోతున్నారు.భవ్యశ్రీకి న్యాయం జరిగి ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఇలాంటి నిందితులకు కఠినమైన శిక్షలు పడి భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు జరగకూడని న్యాయస్థానాన్ని వేడుకుందాం..