ఎల్లో మీడియా విషయానికొస్తే కోడి కత్తి కేసు అని రాస్తారు. కోడి కత్తి మీద కేసు పెట్టారా.. లేక కోడి కత్తి వచ్చి కేసు పెట్టిందా.. జగన్ పై హత్యాప్రయత్నం అని రాయకుండా దానికి ప్రత్యామ్నాయంగా కోడికత్తి కేసు అని రాస్తున్నారు. మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టైతే.. నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టు అని ప్రచురిస్తారు.
అలాగే చంద్రబాబు అయితే అక్రమ కేసు.. జగన్ అయితే అక్రమాస్తుల కేసు అంటూ పదాల వాడకంలో తీవ్ర బేధం చూపుతారు. తాజాగా శ్రీనివాసరావు అప్పీళ్లను కొట్టేయాలంటూ ఎన్ఐఏ ఇన్ స్పెక్టర్ చీఫ్ ఇన్విస్టేగేషన్ ఆఫీసర్ బీవీ. శశిరేఖ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. 2018 అక్టోబరు 25న అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విశాఖ విమానాశ్రయం వీఐపీ లాంచ్ లో కోడికత్తితో శ్రీనివాసరావు దాడి చేశాడు. నిందితుడిపై 2019 జనవరి 23న అభియోగ పత్రం దాఖలు చేశాం. అతడిపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి.
2022 జులైలోనే శ్రీనివాసరావుపై ఎన్ఐఏ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. 2023 మార్చిలో విచారణ ప్రారంభం అయింది. దాడి కేసులో లోతైన విచారణ జరపాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో దిగువ కోర్టులో 8 వారాల విచారణ నిలుపుదల చేయాలని గత నెల 17న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే నిందితుడు అమాయకుడు అనే కోణంలో ఎల్లో మీడియా వార్తలు ప్రచురిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి