అయితే ఏపీలో అమలు చేస్తున్న విధానాలు నచ్చి తమ రాష్ట్రాల్లో కూడా అమలు పరిచేందుకు ఎనిమిది రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. ప్రాథమిక వైద్యంతో పాటు ప్రభుత్వ సేవలన్నింటిని ఒకే దగ్గర అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై వివిధ రాష్ట్రాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ప్రభుత్వ సేవలన్నింటిని ఒకే చోటకి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 22 వేలకు పైగా శాశ్వత భవనాలను నిర్మిస్తోంది.
ఈ నేపథ్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రజలకు ఉపయోగపడే నూతన కార్యక్రమాల అమలు తీరును పరిశీలించడానికి కేరళ, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, బిహార్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ నుంచి దాదాపు 24మంది అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. విజయ నగరం, అల్లూరి సీతారామ రాజు జిల్లాలలోని భోగాపురం, జామి, ఎన్ కోట, అనంతగిరి మండలాల్లో ఈ బృందం పర్యటించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా ప్రత్యేకంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఈ బృందం స్వయంగా పరిశీలించింది. గ్రామాల్లో పనులు కావాలని కోరే ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తూనే గ్రామాల్లో శాశ్వత భవనాల నిర్మాణాలు చేపట్టామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ శివ ప్రసాద్ అధికారుల బృందానికి వివరించారు. రాష్ట్రమంతా గ్రామాల్లో ప్రజలకు సేవలందిచడానికి ఒకే విడతలో 22 వేలకు పైగా భవన నిర్మాణాలను చేపట్టడాన్ని వివిధ రాష్ట్రాల అధికారుల బృందం ప్రశసించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి