ఏపీ సీఎం జగన్ మరోసారి డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ డ్వాక్రా సంఘాల ఖాతాల్లో వడ్డీ రాయితీ జమ చేయబోతున్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద నగదు జమ చేయబోతున్నారు. డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో నేరుగా రూ.1,109 కోట్ల వడ్డీ రాయితీ సొమ్ము  జమ చేయబోతున్నారు  సీఎం జగన్‌. దీని ద్వారా దాదాపు కోటి మంది వరకూ లబ్ధి పొందబోతున్నారు. తీసుకున్న రుణాలు క్రమం తప్పకుండా చెల్లించినవారికి  మాత్రమే ఈ వడ్డీ రాయితీ సౌకర్యం లభిస్తుంది.

వైఎస్సార్ వడ్డీ రాయితీ పథకం కింద అర్హత కలిగిన డ్వాక్రా సంఘాలు  ఏపీలో దాదాపు 9 లక్షల వరకూ ఉన్నాయి. ఓవైపు ఏపీని కరోనా కమ్మేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అసలే ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇప్పటికే ఏపీకి అప్పులు పెరిగిపోతున్నాయన్న  వాదన ఉంది. ఇప్పటికే జగన్ ఖజానాను దివాలా తీయించారని టీడీపీ వంటి పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. అయినా సరే జగన్ మాత్రం యథావిధిగా సంక్షేమ పథకాలకు మాత్రం కొరత రానీయడం లేదు.

ఇంత కష్ట కాలంలోనూ జగన్ సర్కారు మాత్రం సంక్షేమానికే పెద్ద పీట వేయడం ఆశ్చర్యపరుస్తోంది.  కొన్నిరోజుల క్రితమే జగన్ ప్రభుత్వం  2019-20 రబీ సీజన్‌లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం వడ్డీ రాయితీ‌ అందించింది.. ఇందుకు గాను  రూ.128.47 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. రైతుకిచ్చిన వాగ్ధానాలు అమలో భాగంగానే 6.28 లక్షల మంది రైతులకు 2019–2020 రబీ రాయితీ కింద వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద అక్షరాల రూ.128 కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు జగన్.

అంత కంటే ముందు.. జగనన్న విద్యా దీవెన పథకం కింద 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజురీయింబర్స్‌మెంట్‌ మొదటి విడత నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. 9,79,445 మంది తల్లుల ఖాతాల్లో రూ.671 కోట్లు జమ చేశారు. అంటే.. సంక్షేమం విషయంలో జగన్ ఎక్కడా తగ్గడం లేదన్నమాటేగా. అంతే.. అంతే..


మరింత సమాచారం తెలుసుకోండి: