ఈ అంశంలో ఫ్రాన్స్ ఆర్థిక మంత్రిపై ఉద్దేశించి రష్యా మాజీ అధ్యక్షుడు, దేశ భద్రతా మండలి డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదేవ్ మండిపడ్డారు. ఫ్రాన్స్ తమతో పెట్టుకుంటే యుద్ధం తప్పదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. మెద్వేదేవ్ ఏమన్నారంటే.. రష్యాపై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తామని ఫ్రాన్స్ మంత్రి అంటున్నారని.. కానీ.. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
అంతే కాదు.. మానవ చరిత్రలో ఆర్థిక యుద్ధాలన్నీ వాస్తవరూపం దాల్చాయని మర్చిపోవద్దు సుమా అని మెద్వెదేవ్ కామెంట్ చేశారు. ఈ వివాదానికి ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి బ్రునో లె మైరై చేసిన వ్యాఖ్యలే కారణం.. ఆయన ఏమన్నారంటే.. మేం తలచుకుంటే రష్యా ఆర్థిక వ్యవస్థ పతనానికి దారి తీస్తాం అని అన్నారు. తాము తీసుకునే నిర్ణయాల ప్రభావంతో సాధారణ రష్యన్లు కూడా బాధపడే అవకాశం ఉందని బ్రునో హెచ్చరించారు. అందుకే తాము సంయమనం పాటిస్తున్నామన్నారు.
ఇలా ఫ్రాన్స్ మంత్రి బ్రునో మాట్లాడినందుకు ఇప్పుడు దిమిత్రి మెద్వెదెవ్ ఇలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలు యథాలాపంగా చేసినవా.. లేక.. రష్యా మనసులో ఫ్రాన్స్ తో కూడా యుద్ధం చేయాలన్న ఆలోచన ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసినందుకే ప్రపంచం మొత్తం రష్యాకు వ్యతిరేకంగా తయారైంది.. రష్యా పై యుద్దోన్మాది అన్న ముద్ర పడింది. అయినా రష్యా వెనక్కు తగ్గట్లేదు. మరి ఇప్పుడు రష్యా నాయకుల మాట తీరు చూస్తే.. అటు ఫ్రాన్స్ వంటి దేశాలనూ యుద్ధంలోకి లాగే పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ కేవలం మాటల యుద్ధాలేనా.. చేతల వరకూ వెళ్తాయా.. అన్నది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి