అయితే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలను ఏపీ సీఐడీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఎవరి మీద పోస్టులు చేసినా వదలమని తాజాగా హెచ్చరించింది. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలపై దృష్టి సారించామని నిబంధల్నీ ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరించారు. సీఎంపై, వారి కుటుంబ సభ్యులపై అనుచిత పోస్టులు పెడుతున్నారు. మారు పేర్లు, నకిలీ ఖాతాలు సృష్టించి పోస్టులు పెడితే పట్టుకోలేమని అనుకోవడం సరికాదు. ఫేక్ అకౌంట్స్ ను నడిపే వారిని పట్టుకొని చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వాటిని ప్రోత్సహించే వారిపై సైతం చర్యలుంటాయి అని పేర్కొన్నారు.
అయితే టీడీపీ సోషల్ మీడియాలో చురుకుగా ఉంది. ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను సోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకెళ్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇది ప్రభుత్వానికి మైనస్ గా మారింది. దీనిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం సీఐడీ ప్రయోగించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతల్ని లక్ష్యంగా చేసుకొని సీఐడీ పనిచేస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.
అయితే ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ సోషల్ మీడియా గురించి మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకొంది. హైకోర్టు జడ్జిపై అనుచిత పోస్టులు పెట్టిన 19మందికి నోటీసులు ఇచ్చామని అందులో టీడీపీ నేత బుద్దా వెంకన్న కూడా ఉన్నారన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరుమీద కూడా కొంతమంది అకౌంట్లు నడుపుతున్నారని ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు వివరించారు. సోషల్ మీడియా నియంత్రిచడం హర్షించతగ్గ పరిణామమే అయినా.. విపక్షాలను టార్గెట్ చేయడం తగదని..అన్ని ఖాతాలపై ఫోకస్ చేయాలని పలువురు కోరుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి