
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే పొలిటికల్ గవర్నెన్స్ అనే మాట చెబుతూ వస్తున్నారు. ఐదేళ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిన పెడుతూ అభివృద్ధిని పట్టాలెక్కిస్తానని వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకుండా అన్ని స్థాయిలో పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తూ పొలిటికల్ గవర్నమెంట్ అమలు చేస్తానని చెబుతున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన వారికి ప్రాధాన్యమిస్తూ కొంతవరకే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. అయితే నియోజకవర్గ స్థాయిలో కేడర్ ను బోలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ భవిష్యత్తు కంటే వ్యక్తిగత స్వప్రయోజనాలకే పెద్దపెట్టవేస్తూ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఐదేళ్లపాటు తమ ఎంతో కష్టపడ్డాం .. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాం .. వైసిపి వాళ్ళు పెట్టిన ఇబ్బందులు ఎదుర్కొని పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కృషి చేశాము.. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలు తమ అస్సలు పట్టించుకోవడంలేదని తీవ్ర అసంతృప్తితో కార్యకర్తలు ఉన్నారు.
వైకాపా పాలనలో అక్రమ కేసులు వేధింపులు అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన నాయకులు .. కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. వారిలో అర్హులను గుర్తించి నామినేటెడ్ పదవులు లేదా నియోజకవర్గ పదవులు లేదా ప్రభుత్వ పథకాల పరంగా లబ్ధి చేకూర్చటం లేదా పార్టీ పదవులు ఇవ్వడం చేయాలి. అలాంటిదేమీ క్షేత్రస్థాయిలో జరగటం లేదు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా తమకు ఎలాంటి గుర్తింపు లేదని చాలామంది సీనియర్ నాయకులు ఆవేదనతో ఉన్నారు. అయితే చంద్రబాబు 2014 - 2019 తో పోలిస్తే నామినేటెడ్ పదవులు భర్తీలో కొంత వేగం పెంచారు. కానీ ఇప్పటికీ చాలా పదవులు భర్తీ చేయకపోవడంతో కార్యకర్తలలో నిరాశ పెరుగుతుంది. దేవాలయాల ధర్మకర్తల మండలి, మార్కెట్ కమిటీలు , సహకార సంఘాల త్రిమన్ కమిటీల పదవులు చాలా పెండింగ్లో ఉన్నాయి. వీటిని త్వరగా భర్తీ చేసి అసంతృప్తితో ఉన్న కార్యకర్తలను గుర్తించి వారికి ప్రాధాన్యం ఇవ్వకపోతే వారంతా తీవ్ర అసంతృప్తితో సైలెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే వచ్చే ఎన్నికలలో పార్టీ తీవ్రంగా నష్టపోవడంతో పాటు 2019 ఎన్నికల రిపీట్ అవ్వడం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు