- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఏపీలో కూటమిలో ప్రధానోపాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ వ్యూహానికి కూటమిలో ఉన్న జనసేన - బిజెపి విలవిలలాడుతున్న పరిస్థితి. కూట‌మి లో తెలుగుదేశం - జనసేన - బిజెపి మూడు పార్టీలు కలిసి అధికారాన్ని చలాయిస్తున్నాయి. కానీ ప్రభుత్వం అంటే తెలుగుదేశం మాత్రమే అని ప్రజలకు సంకేతాలు ఇవ్వడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో జనసేన - బిజెపికి పరోక్షంగా చెక్‌ పెట్టటం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని ఈనెల రెండవ తేదీ నుంచి తెలుగుదేశం చేపట్టింది. ఇది పూర్తిగా తమ కార్యక్రమంగా తెలుగుదేశం నిర్వహిస్తోంది. జనసేన - బిజెపి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి .. ఈ కార్యక్రమంలో జనసేన .. బిజెపిని కలుపుకుని వెళ్లడానికి తెలుగుదేశంకు ఎంత మాత్రం ఇష్టం లేదు.


అధికారంలోకి వచ్చేందుకు ఆ రెండు పార్టీలు సాయాన్ని తెలుగుదేశం తీసుకుంది. అలా అని ఆ రెండు పార్టీలను రాజకీయంగా బలోపేతం చేసే ఉద్దేశం చంద్రబాబుకి ఎంత మాత్రం ఉన్నట్టు కనిపించడం లేదు అన్న చర్చలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్లో జనసేన - బిజెపి ప్రజా ప్రతినిధులు ఎక్కడా కనిపించడం లేదు. అసలు తమను చంద్రబాబు ఈ విషయంలో పట్టించుకోవడంలేదని జనసేన - బిజెపి నాయకులు గుర్రుగా ఉన్నారు. ఏది ఏమైనా రాజకీయాలలో శాశ్వత మిత్రులు ... శాశ్వత శత్రువులు ఉండరు అన్నది మరోసారి నిరూపితం అయింది. పొత్తులో ఉన్న లేకపోయిన క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతంగా ఉంచుకోవటానికి తాను మాత్రమే ప్రజల్లో ఉండాలని ఉద్దేశంతో టిడిపి ఇలా వ్యూహాత్మకంగా ఇంటింటికి కార్యక్రమాన్ని చేపట్టినట్టు కనిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: