ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు ప్ర‌పంచ‌దేశాలు అత‌లాకుత‌లం అవుతున్న సంగ‌తి తెలిసిందే. వ్యాక్సిన్ లేని ఈ మ‌హ‌మ్మారిని మ‌ట్టుపెట్టేందుకు దేశ‌దేశాలు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంమొత్తం ఇళ్లకే పరిమితమైంది. ఈ క్రమంలోనే కొందరికి తినేందుకు తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మ‌రి కొంద‌రు కంపెనీలు శాశ్వ‌తంగా మూత ప‌డ‌డంతో ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ఐటీఐ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది.

 

 మొత్తం 84 ఖాళీలను ప్రకటించింది. మిడిల్, సీనియర్ లెవెల్ మేనేజ్‌మెంట్‌లో ఫైనాన్స్ ఎగ్జిక్యూటీవ్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ లాంటి పోస్టులున్నాయి. వాటిని ప‌రిశీలిస్తే.. మొత్తం 84  పోస్టులు ఉండ‌గా.. అందులో ఫైనాన్స్ ఎగ్జిక్యూటీవ్- 9, ఫైనాన్స్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ- 8, హెచ్ఆర్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ- 16, చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ / అడిషనల్ జనరల్ మేనేజర్ (ఆర్ అండ్ డీ)- 1, సీఎంఆర్ / జనరల్ మేనేజర్ / అడిషనల్ మేనేజర్ (లీగల్)- 1, మేనేజర్ / చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ (టెక్నికల్)- 8, డిప్యూటీ మేనేజర్ / మేనేజర్ (టెక్నికల్ అసిస్టెంట్ టు సీఎండీ)- 1 పోస్టులు ఉన్నాయి.

 

వీటితో పాటు డిప్యూటీ జనరల్ మేనేజర్ / అడిషనల్ జనరల్ మేనేజర్ (పీఆర్)- 1, మేనేజర్ / చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఆర్ అండ్ డీ)- 4, జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)- 1, జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్-స్టార్టప్ హబ్ (జనరల్ మేనేజర్)- 1, ప్రాజెక్ట్ హెడ్- సెల్ టెక్నాలజీ (అడిషనల్ జనరల్ మేనేజర్)- 1, ప్రాజెక్ట్ హెడ్- డేటా సెంటర్ (అడిషనల్ జనరల్ మేనేజర్)- 1, మేనేజర్ / చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 8, మేనేజర్ / చీఫ్ మేనేజర్ / డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)- 8 పోస‌ట్టులు కూడా ఉన్నాయి. అయితే ఇప్ప‌టికే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.  

 

ఇక 2020 మే 5 ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ. అంటే మ‌రో ఐదు రోజులు మాత్రమే గ‌డువు మిగిలింది. కాబ‌ట్టి, ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. సీఏ / ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, బీఈ / బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలి. దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. ఇక ఈ పోస్టుల గురించి మ‌రిన్ని వివ‌రాల కోసం http://www.itiltd.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: