చ‌రిత్ర అంటే అనేక సంఘ‌ట‌న‌ల స‌మ‌హారం...అనేక మార్పుల‌కు ..‌.ప్ర‌గ‌తికి..పోరాటాల‌కు..ప‌రిణామ క్ర‌మానికి..మంచి చెడుల‌కు సాక్ష్యం.. అలాంటి సంఘ‌ట‌నలెన్నో...మార్పులెన్నో మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూన్ 18న చోటు చేసుకున్నాయి. ఆ వివ‌రాలు మీకోసం హెరాల్డ్ అందిస్తున్న స‌మాచారం..

 

ముఖ్య సంఘ‌ట‌న‌లు

618: లీ యువాన్ (566 నుంచి 25 జూన్ 635 వరకు) టాంగ్ వంశం ఛైనాను 300 సంవత్సరాలు పాలించటానికి పునాది వేశాడు. ఇతడే ఈ వంశంలో (ఎంపరర్ గవోజు ఆఫ్ టాంగ్ 618 నుంచి 626 వరకు) మొదటి ఛక్రవర్తి .
1815: వాటర్లూ యుద్ధం : నెపోలియన్ బోనపార్టె బెల్జియం లోని వాటర్లూలో ఛేసిన ఆఖరి యుద్ధంలో ఓడిపోయాడు. ఈ యుద్దాన్ని సెవెన్త్ కోలిషన్ యుద్దం గా, వాటర్లూ యుద్ధంగా పిలుస్తారు).
1858: ఛార్లెస్ డార్విన్ ను జీవపరిణామం సిద్దాంతాన్ని ప్రచురించటానికి ప్రేరేపించిన వ్రాతప్రతిని (జీవపరిణామం విషయం మీద), తన సహచరుడైన ఆల్ ఫ్రెడ్ రస్సెల్ వాల్లేస్ నుంచి అందుకున్నాడు.
1953: ఈజిప్టు రాచరికాన్ని రద్దుచేసింది.
1908: ఫిలిప్పీన్స్ దేశపు యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ ని స్థాపించారు.
1923: మిచిగాన్ లోని కలమజూలో ఉన్న 'చెకర్ మోటార్స్ కార్పొరేషన్' తయారు చేసిన చెకర్ టాక్సీ లను మొట్ట మొదటి సారి గా, ప్రజల కోసం, రోడ్ల మీద నడపటం మొదలు పెట్టాఅరు.
1940: రెండవ ప్రపంచ యుద్దం: నాజీ జర్మనీకి లొంగిపోయిన ఫ్రాన్స్ దేశాన్ని విడిపించాలని, నాజీ జర్మనీ ని, ఆపటానికి, ప్రెంచి ప్రజలు తనకు మద్దత్తు ఇవ్వాలని, ఫ్రెంచి సైన్యానికి నాయకుడైన జనరల్ ఛార్లెస్ డి గాల్, విజ్ఞప్తి చేసాడు.
1972: బ్రిటిష్ యూరోపియన్ ఎయిర్ వేస్ ఫ్లైట్ 548, లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన 3 నిమిషాలలో స్టెయిన్స్ నగరం దగ్గర కూలి, 118 మంది మరణించారు. బ్రిటన్ లో జరిగిన ఘోర విమానప్రమాదంలో ఇది ఒకటి.
1977: ఎస్.ఎల్. షక్‌దర్ భారతదేశపు ప్రధాన ఎన్నికల అధికారిగా పదవీ స్వీకారం (1977 జూన్ 18 నుంచి 1982 జూన్ 17 వరకు)
1981: ఎయిడ్స్ రోగాన్ని కాలిఫోర్నియా లోని సాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని వైద్యులు గుర్తించారు.
1982: ఆర్.కె. త్రివేది భారత దేశపు ప్రధాన ఎన్నికల అధికారి గా పదవీ స్వీకారం (1982 జూన్ 18 నుంచి 1985 డిసెంబరు 31 వరకు)
1983: ప్రపంచకప్ క్రికెట్ ‌లో కపిల్ దేవ్ జింబాబ్వే పై 175 పరుగులు సాధించి ఒకరోజు క్రికెట్‌లో భారత్ తరపున తొలి శతకాన్ని నమోదుచేశాడు.
1983: మొదటి అమెరికా రోదసీ యాత్రికురాలు సాల్లీ రైడ్ (ఎస్.టి.ఎస్-7)
2001: భారత ప్రభుత్వం నాగాలాండ్ లోని నాగా విద్రోహులతో కాల్పుల విరమణ ఒప్పందం సమయాన్ని పెంచటంపై మణిపూర్ లో ఆందోళనలు జరిగాయి.
2006: మొదటి కజక్ దేశపు ఉపగ్రహం 'కజ్ శాట్' ప్రయోగించారు.

 

జననాలు

1942 : రోజెర్ ఎబెర్ట్ అమెరికాకు చెందిన సినీ విమర్శకుడు, సినీ చరిత్రకారుడు, పాత్రికేయుడు
1955: శాండీ అల్లెన్, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7'7 1/4" (232 సెంటిమీటర్లు). 53వ ఏట మరణించింది. (మ.2008)
1921: పెండేకంటి వెంకటసుబ్బయ్య, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.1993)

 

మరణాలు

1929: వేదము వేంకటరాయ శాస్త్రి, సుప్రసిద్ధ పండితుడు, కవి, విమర్శకుడు, నాటకకర్త (జ.1853).
1936: మాక్సిం గోర్కీ, రష్యన్ రచయిత (జ.1868).
1948: హరిలాల్ గాంధీ, మహాత్మాగాంధీ ప్రథమ పుత్రుడు (జ.1888).
1953: పాలకోడేటి శ్యామలాంబ, స్వాతంత్ర్యసమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది (జ.1902).
1986: ఖండవల్లి లక్ష్మీరంజనం, సుప్రసిద్ధ సాహిత్యవేత్త, పరిశోధకుడు (జ.1908).
2017: గండవరం సుబ్బరామిరెడ్డి ప్రముఖ నాటక రచయిత, నటుడు, దర్శకుడు, నిర్వహకుడు, విమర్శకుడు (జ. 1937).
పండుగలు , జాతీయ దినాలు
ఆటిస్టిక్ ప్రైడ్ డే
హిందూమహాసముద్రం లోని సీ ఛెల్లెస్ దేశపు (ద్వీప సముదాయం) జాతీయ దినం.
గోవా స్వాతంత్య్ర దినోత్సవం.

మరింత సమాచారం తెలుసుకోండి: