ప్రస్తుత కాలంలో ఇంజనీరింగ్ చదివే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది.. బీటెక్ చదివే వాళ్ళ సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తుంది. అయితే ఉద్యోగాలు చేసే వాళ్ళు మాత్రం తక్కువ అయ్యారు. సాఫ్టు వేర్ కంపెనీలు మాత్రం చాలా కష్ట తరమైన కోర్సులను తీసుకురావడం వల్ల మల్టీ నేషనల్ కంపెనీలలో జాబ్ లు దొరకడం అనేది కొంతమందికే సాధ్యమవుతుంది.. కాగా ఇప్పుడు ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీ గూగుల్ బీటెక్ విద్యార్థులకు కొత్త అవకాశాలను అందిస్తుంది. వాటిలో నైపుణ్యం సాధిస్తే జాక్ పాట్ కొట్టినట్లే అంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..



ప్రెష్ గ్రాడ్యుయేట్స్‌కి ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంజనీరింగ్ ఇంటర్న్ సమ్మర్ 2021 కార్యక్రమానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ అర్హులని వెల్లడించింది.. ఈ ఇంటర్న్‌షిప్ లో సెలెక్ట్ అయిన విద్యా ర్థులకు లైఫ్ సెటిల్ అయ్యేలా గూగుల్ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది..



మరి బీటెక్ విద్యార్థుల ఈ ఇంటర్న్‌షిప్ కు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్టూటర్ సైన్స్ లాంటి టెక్నికల్ బ్రాంచ్ బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారై ఉండాలి. ఇక కంప్యూటర్ ల్యాంగ్వేజ్ లు అయిన సీ, సీ+,జావా, పైథాన్  వంటి కంప్యూటర్ లాంగ్వేజ్ లతో పాటుగా ఎస్ క్యూఎల్, స్పింగ్, హైబర్ నేట్, వెబ్ సర్వీసెస్, జావా స్క్రిప్ట్ వర్క్ నైపుణ్యం కలిగి ఉండాలి.  కనీసం అవగాహన కలిగి ఉండాలి..ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాలు కొనసాగుతోంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 11, 2020 దరఖాస్తు చేసుకోవచ్చు.. హైదరాబాద్ , బెంగుళూరు లోని గూగుల్ కంపెనీ లో ఈ ఇంటర్న్‌షిప్‌ చేసే ఛాన్స్ ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: