ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ ఫలితాలు కాసేపటి క్రితం విడుదలవ్వడం జరిగింది. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంకా విద్యాశాఖ అధికారులతో కలిసి ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ అనేది ఆలస్యం కాకుండా ఉండటం కోసం మొదట ఎంపీసీ విభాగాల ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించడం జరిగింది. ఇక ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను https://sche.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చును.ఈ ఎగ్జామ్ కి మొత్తం 1,06,090 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా అందులో 1.7 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 79,221 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అలాగే బాలికల విషయానికి వస్తే.. 70488 మంది బాలికలు రిజిస్టర్ చేసుకోగా..అందులో 66453 మంది హాజరవ్వడం జరిగింది. వారిలో ఇక 54,984 మంది క్వాలిఫై అయ్యారు.

ఇక ఈ ఫలితాల్లో అనంతపురం జిల్లా పరిగి మండలం సేవామందిరానికి చెందిన శ్రీ నిఖిల్ ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగపు పరీక్షలో మొదటి ర్యాంకు సాధించడం జరిగింది. నిఖిల్ తండ్రి విషయానికి వస్తే.. ఆయన పేరు వెంకటేశ్వరరావు. ఈయన సేవా మందిరం సమీపంలోని అంధుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.ఇక ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో నిర్వహించడం జరిగింది.అగ్రికల్చర్ ఇంకా ఫార్మసీ విభాగాల పరీక్షలు సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో జరిగాయి. అలాగే కంప్యూటర్‌ ఆధారిత విధానం ద్వారా ఈ పరీక్షలను నిర్వహించడం జరిగింది.ఇక.. ఈ నెల 18 వ తేదీ నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యే అవకాశం కూడా ఉంది. ఈఏపీసెట్ ద్వారా ఇంజనీరింగ్ ఇంకా బయోటెక్నాలజీ అలాగే బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ తో పాటు బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇంకా బీటెక్‌ అగ్రి ఇంజనీరింగ్ మరియు బీఎస్సీ (హార్టికల్చర్‌), బీఎస్సీ (అగ్రి), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/ బీఎఫ్‌ఎస్సీ, బీ-ఫార్మసీ ఇంకా ఫార్మా డీ కోర్సులలో ప్రవేశాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: