ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. మొదట్లో నానా బీభత్సం సృష్టించి ప్రజల ప్రాణాలను హరించిన ఈ వైరస్ ఇపుడు కాస్త శాంతించింది, కానీ ఇప్పటికీ మన చుట్టూ తిరుగుతూనే ఉంది. కోవిడ్ కారణంగా విద్యార్థుల జీవితాల్లో కూడా ఒడిదుడుకులు ఏర్పడిన విషయం తెలిసిందే. దాదాపు సంవత్సరం పైనే పాఠశాలలు మూసేశారు. దాంతో పిల్లల చదువులు అటకెక్కాయి. ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొన్ని పాఠశాలలు జరగడం లేదు. తల్లితండ్రులు గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని ఎప్పుడు ఈ వైరస్ ఏ కొత్త సమస్యను తీసుకొస్తుందో అని భయపడుతూనే పిల్లల్ని స్కూల్స్ కి పంపుతున్నారు.  

ఈ నేపథ్యంలో స్కూళ్ల పునఃప్రారంభంపై కరోనా ఇప్పటికీ ఉన్న కారణంగా పిల్లల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని కేంద్ర విద్యాశాఖ తాజాగా కొన్ని కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

* కరోనానే కాకుండా పరిశుభ్రత ఉంటే వైరస్ లను అరికట్టవచ్చు అన్న ఉద్దేశ్యంతో స్కూళ్ల పరిసరాలు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ నిత్యం పరిశుభ్రంగా ఉండాలని తెలియచేసింది.

* పిల్లలు తమ చేతులకు శానిటైజర్ రాసుకుని, మాస్క్ వేసుకుని పాఠశాలలకు రావాలి.

* తరగతి గదిలో పిల్లల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు ఉండాలి.

* పాఠశాల సిబ్బంది, అసెంబ్లీ హాల్, పిల్లలు టీచర్లు ఇలా ప్రతి వారి మద్య భౌతికదూరం ఖచ్చితంగా పాటించాలి.

* భౌతిక దూరం పాటించడం కుదరని పాఠశాలలు ఎటువంటి ఈవెంట్ లను నిర్వహించరాదు.

* హాస్టళ్లలో కూడా ఇదే సూచనలు పాటించబడతాయి. అలాగే  పిల్లల బెడ్ ల మధ్య కూడా భౌతిక దూరం అవసరం కాబట్టి చర్యలు తప్పనిసరి.

* బస్సుల్లోను , వ్యాన్ ల్లోను విద్యార్థులు దూర దూరంగా కూర్చునేలా చూడాలి.

* పిల్లల్ని స్కూల్స్ కి పంపడానికి ఇష్టం లేని తల్లితండ్రులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం, పిల్లలని స్కూల్స్ కి పంపాలా వద్దా అన్న నిర్ణయం పూర్తిగా తల్లితండ్రులదే.

అంతే కాకుండా గత నలుగురి రోజులు ముందుగా తెలంగాణాలో స్కూల్స్ ప్రారంభం అయినా హాజరు శాతం మెరుగా లేదు. ఇందుకోసం ఆయా స్కూల్స్ పిల్లల తల్లితండ్రులకు ఫోన్ చేసి మేము ఇక్కడ అన్ని కరోనా రక్షణ చర్యలను తీసుకుంటున్నామని అవగాహనా కల్పిస్తే ఉపయోగం ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: