పోయిన సంవత్సరం కార్తికేయ "బెదురులంక 2012" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... క్లాక్స్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను రాబట్టింది. 

మూవీ తో కార్తికేయ కి కూడా చాలా రోజుల తర్వాత మంచి విజయం దక్కింది. ఇలా బెదురులంక 2012 మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న ఈ యువ నటుడు తాజాగా భజే భాయు వేగం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. దానితో తాజాగా మేకర్స్ ఈ సినిమా యొక్క విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ని మే 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు.

ఇక మేకర్స్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో కార్తికేయ వైట్ కలర్ లో ఉన్న స్పోర్ట్స్ డ్రెస్ ను వేసుకొని చేతిలో ఓ బ్యాట్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ ఉండగా ... యు వి కాన్సెప్ట్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి బెదురులంక 2012 మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ నటుడు భజే వాయు వేగం సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: