మాయాతీలంగర్.. తెలుసు కదా.. మెయిల్ డామినేషన్ ఉండే స్పోర్ట్స్ యాంకరింగ్ ను ఫిమేల్ ఓరియంటెడ్ చేసి పడేసింది.. ఇక హిందీ విషయానికి వస్తే మందిరా బేడీ..ఇంకా చాలామంది ఉన్నారు. అదే తెలుగులో అయితే.. మొన్నటి దాకా ఇది ఒక శేష ప్రశ్న గానే ఉండేది. కానీ ఎప్పుడైతే ఇందులోకి వింధ్య అలియాస్ వింధ్యా విశాఖ ఎంటర్ అయిందో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది. అయితే ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు. ఇందుకోసం వింధ్య ఎన్నో కష్టాలు పడింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. చివరిగా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.స్టార్ స్పోర్ట్స్ తో ప్రయాణం ప్రారంభించక ముందు వింధ్య అనేక చానల్స్ తిరిగింది. తన ప్రస్థానాన్ని హెచ్ఎంటీవీతో ప్రారంభించింది. ఆ తర్వాత స్టార్ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న మా మ్యూజిక్ ఛానల్ లో వీడియో జాకీగా పనిచేసింది. కారణాలు తెలియదు గాని, అందులో నుంచి బయటికి వచ్చేసింది. ఆ తర్వాత 2014లో జీ తెలుగులో పనిచేసింది. 2016 నుంచి 2017 వరకు ఈటీవీ ప్లస్ లో కనిపించింది. టీవీ9 లో మెరిసింది. ఈటీవీ2 లో కొన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అయితే ఇవేవీ వింధ్య సుదీర్ఘ లక్ష్యాలు కాలేకపోయాయి. ఆమె ప్రయాణానికి కొన్ని అడుగులుగా మాత్రమే ఉపకరించాయి. స్థిరంగా లేకుంటే ఎలా అనే ప్రశ్న ఆమె మదిలో మెదిలినప్పుడు.. 2017లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో వచ్చిన అవకాశం వింధ్య జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ఆమెను తెలుగు మాయాతీ లంగర్ ను చేసేసింది. అయితే ఈ ప్రయాణంలో వింధ్యకు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం లారా సహకరించాడు.. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.

స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లో తెలుగు కామెంట్రీ వర్షన్ ప్రారంభించింది. దీనిని వింధ్యతోనే మొదలుపెట్టింది. ఆమెతో పాటుగా కొంతమంది మగ వ్యాఖ్యాతలు కూడా ఉండేవారు. అయితే అప్పట్లో ఆమెకు స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పనిచేస్తున్న అనుభవం అంతంత మాత్రమే ఉండడంతో.. కొంచెం ఇబ్బందిగా అనిపించిందట. ” స్టార్ స్పోర్ట్స్ తెలుగు వెర్షన్ కామెంట్రీ, ప్రజెంటేషన్ నాతో ప్రారంభించినప్పుడు ఒకింత ఒత్తిడిగా ఉండేది. నేను ఆ షో లు పోస్ట్ చేసే ముందు మందిరా బేడి, మయాతి లాంగర్ వంటి వారి వీడియోలను చూసేదాన్ని. ఆ తర్వాత కచ్చితంగా నేను చేయగలను నిర్ణయించుకొని.. హోస్ట్ చేయడం మొదలుపెట్టాను. ఇతర భాషలకు చెందిన హోస్టులతో కూడా పని చేశాను. వారి హావభావాలను అర్థం చేసుకొని.. ఆటకు మరింత అందం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశానని” వింధ్య చెబుతోంది.

దానికంటే ముందు వింధ్య స్పోర్ట్స్ హోస్టింగ్ కు సంబంధించి వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా నుంచి పాఠాలు నేర్చుకుంది. డ్వెన్ బ్రావో కూడా ఆమెకు కొన్ని కొన్ని మెలకువలు నేర్పించాడు.. వింధ్య తన స్పోర్ట్స్ హోస్టింగ్ ప్రయాణాన్ని లారాతో ప్రారంభించింది. స్పోర్ట్స్ హోస్టింగ్ లో నియమాలు, నిబంధనల గురించి అతడి ద్వారానే తెలుసుకొంది. 2019లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ జరిగింది. ఆ టోర్నీ ప్రసారహక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది. ఈ పెద్ద ఈవెంట్ కు హోస్ట్ చేసే అవకాశం వింధ్యకు దక్కింది. ఆ సమయంలో హోస్టింగ్ లో మెలకువలు లారా ఆమెకు నేర్పించాడు. ఆ టోర్నీ జరిగిన నెలరోజుల పాటు వింధ్య లారా ఇంట్లోనే తన భర్త విశాల్ తో కలిసి ఉంది.. ఆ సమయంలో క్రికెట్ పాఠాలను, తన జీవితంలో జరిగిన సంఘటనలను లారా ఆమెతో పంచుకున్నాడు. ఇవి తన కెరీర్ కు ఎంతో ఉపయోగపడ్డాయని వింధ్య పలుమార్లు చెప్పుకొచ్చింది. ఇది తనకు జీవితంలో లభించిన అతి గొప్ప అవకాశం అని పేర్కొంది. వాస్తవానికి ఇటువంటి అవకాశం తెలుగులోనే కాదు, మరెవరికీ రాదు. క్రికెట్ దిగ్గజమైన లారా తన ఇంట్లో ఒక స్పోర్ట్స్ హోస్ట్ కు నెలరోజులపాటు ఆతిథ్యం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు.ఇంకా చాలామంది ఉన్నారు. అదే తెలుగులో అయితే.. మొన్నటి దాకా ఇది ఒక శేష ప్రశ్న గానే ఉండేది. కానీ ఎప్పుడైతే ఇందులోకి వింధ్య అలియాస్ వింధ్యా విశాఖ ఎంటర్ అయిందో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది. అయితే ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు. ఇందుకోసం వింధ్య ఎన్నో కష్టాలు పడింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. చివరిగా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.

స్టార్ స్పోర్ట్స్ తో ప్రయాణం ప్రారంభించక ముందు వింధ్య అనేక చానల్స్ తిరిగింది. తన ప్రస్థానాన్ని హెచ్ఎంటీవీతో ప్రారంభించింది. ఆ తర్వాత స్టార్ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న మా మ్యూజిక్ ఛానల్ లో వీడియో జాకీగా పనిచేసింది. కారణాలు తెలియదు గాని, అందులో నుంచి బయటికి వచ్చేసింది. ఆ తర్వాత 2014లో జీ తెలుగులో పనిచేసింది. 2016 నుంచి 2017 వరకు ఈటీవీ ప్లస్ లో కనిపించింది. టీవీ9 లో మెరిసింది. ఈటీవీ2 లో కొన్ని కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అయితే ఇవేవీ వింధ్య సుదీర్ఘ లక్ష్యాలు కాలేకపోయాయి. ఆమె ప్రయాణానికి కొన్ని అడుగులుగా మాత్రమే ఉపకరించాయి. స్థిరంగా లేకుంటే ఎలా అనే ప్రశ్న ఆమె మదిలో మెదిలినప్పుడు.. 2017లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో వచ్చిన అవకాశం వింధ్య జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ఆమెను తెలుగు మాయాతీ లంగర్ ను చేసేసింది. అయితే ఈ ప్రయాణంలో వింధ్యకు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం లారా సహకరించాడు.. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: