పసిడి ప్రియులకు గుడ్ న్యూస్...ఎందుకంటే ఈరోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. మొన్నటి వరకు భారీగా పెరుగుతూ వచ్చిన ధరలు.. నిన్న కాస్త దిగోచ్చాయి. అదే విధంగా ఈరోజు కూడా తగ్గుతాయని అనుకున్నారు. కానీ వారి నమ్మకం వమ్ము అయ్యింది.బంగారం నిన్న ఎలా ఉందో అలానే ఉంది.బంగారం ధర నిలకడగానే కొనసాగితే.. వెండి రేటు మాత్రం పడిపోయింది. వెండి ధర వెలవెలబోయింది.. ఈరోజు కూడా నిన్న లాగే కొనుగోళ్లు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఇండియన్ మార్కెట్ లో మాత్రం స్థిరంగా కొనసాగుతుంది.. 


హైదరాబాద్ మార్కెట్ లో నేడు బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ. 48,650 వద్దనే కొనసాగుతోంది. అదేసమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 44,590 వద్ద స్థిరంగా ఉంది.. బంగారం ధర స్థిరంగా కొనసాగుతున్న.. వెండి ధరలు కిందకు తగ్గాయి. 


వెండి ధర కేజీకి రూ.200 తగ్గుదలతో రూ.73,800కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.. బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం పెరుగుదలతో 1783 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా పైకి కదలింది. ఔన్స్‌కు 0.39 శాతం పెరుగుదల తో 26.31 డాలర్లకు ఎగసింది.ఇకపోతే గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరల పై ప్రభావం చూపిస్తున్నాయి.. మరి రేపటి ధరలు మార్కెట్ లో ఎలా నమోదు అవుతాయో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: