ఈ రోజుల్లో చాలా మంది కూడా ఫిట్‌నెస్ కోసం కరివేపాకు రసం తాగుతారు. అయితే  కరివేపాకుతో టీ కూడా తయారు చేయవచ్చు.ఇది ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది.చాలా రకాల శారీరక సమస్యల నుంచి ఈ టీ మనల్ని కాపాడుతుంది. దాని వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కరివేపాకులో ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, విటమిన్ ఎ, కెరోటిన్ ఇంకా విటమిన్ సి ఇలా చాలా పోషకాలు కారణంగా దీన్ని విరివిగా వాడుతారు.పైగా ఇది ఆహారం రుచిని కూడా పెంచుతుంది. ఇంకా మన శరీరానికి కూడా చాలా మేలు చేస్తుంది.కరివేపాకు టీలో చాలా పోషకాలు ఉన్నాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఈ కరివేపాకు టీ తాగితే శరీరం అవసరమైన యాంటీఆక్సిడెంట్‌లు పెరుగుతాయి.అలాగే ఈ టీ ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇందులో ఫినోలిక్స్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చాలా మంచి స్థాయిలో కలిగి ఉన్నాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లలో ఉండే మూలకాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ నుంచి రక్షించడంలో చాలా బాగా సహాయపడతాయి.


ఈ కరివేపాకులో కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడానికి సహాయపడే చాలా పోషకాలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకొనేవారు కరివేపాకుతో చేసిన టీని తాగితే బరువు ఈజీగా తగ్గవచ్చు. ఇది తేలికపాటి భేదిమందు లక్షణాలు, జీర్ణ ఎంజైమ్‌లను కలిగి ఉండడం వల్ల ప్రేగు కదలికను బాగా మెరుగుపరుస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.ఈ టీ తాగితే మలబద్ధకం, గ్యాస్ ఇంకా డయేరియా వంటి సమస్యలు చాలా ఈజీగా నయం అవుతాయి.ఇంకా అలాగే గర్భధారణ సమయంలో టీ తీసుకుంటే వాంతులు, వికారం ఇంకా మార్నింగ్ సిక్‌నెస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లబిస్తుంది. కరివేపాకు సువాసన ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించి మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. ఇక మీరు రోజంతా  అలసిపోయినట్లయితే, సాయంత్రం ఒక కప్పు కరివేపాకు టీ తాగితే మీకు అద్భుతమైన విశ్రాంతి లభిస్తుంది. అలాగే మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కరివేపాకు టీని తప్పకుండా తాగండి. మన కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఎ ఇందులో లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: