ఇప్పుడు మనం తింటున్న ఆహారం,గాలి,నీళ్లు,వాతావరణం అన్ని కలుషితం కావడం వల్ల,ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పైన్న శ్రద్ద బాగా పెరిగిపోయింది.అయితే రోజు మనం మంచి ఆరోగ్య కరమైన ఆహారం తీసుకున్నా,తాజా కూరగాయలు తింటున్నా కూడా,ఎదో ఒక అనారోగ్యం బారిన పడుతున్నాము,అయితే మనం తినే ఆహారంలో ఎక్కువగా రైస్ తినడం అంత మంచిది కాదు అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు.రోజుకు ఒకసారి మాత్రమే రైస్ తినాలని అది కూడా మధ్యాహ్నం భోజనము మాత్రమే తీసుకోవాలి అని ఉదయం సాయంత్రం మాత్రం చిరు ధాన్యాలు లేదా సిరి ధాన్యాలతో చేసిన ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు అని చెప్తున్నారు.అయితే ఉదయం బ్రేక్ పాస్ట్, మధ్యాహ్నం భోజనం,మరి రాత్రి పూట సంగతేంటి.కొంత మంది రాత్రి పూట కూడా రైస్ తింటే,మరి కొంతమందికి చపాతీలు తినే అలవాటు ఉంటుంది. అయితే డైలీ నైట్ చపాతీలు కన్నా రొట్టెలు తినడం ఆరోగ్యానికి ఏంతో మేలు అని కొంతమంది నిపుణులు చెప్తున్నారు.కానీ రొట్టెలు చేసుకోవడం కొంతమందికి రాక ఈ చెపాతీలతో సరిపెట్టుకుంటున్నారు. మరి మనం తీసుకునే చపాతీలు ఇంకొంచెం హెల్తీ గా ప్రిపేర్ చేసుకుని తినొచ్చు అని చెప్తున్నారు.మరి అది ఎలాగో చూద్దాం.


ముందుగా జొన్నలు కేజీ, సజ్జలు కేజీ, హాఫ్ కేజీ రాగులు,హాఫ్ కేజీ రాజ్మా, హాఫ్ కేజీ సొయా బీన్స్, హాఫ్ కేజీ మిల్లెట్స్, మొత్తం నాలుగు కేజీ లు తీసుకొని,నాలుగు కేజీ లో సగం అంటే రెండు కేజీ లు గోధుమలని కూడా కలిపి వీటిని మెత్తగా పిండిలా మర పట్టించుకుని ఈ పిండి జల్లిడా పట్టుకొని రెడీ చేసుకొని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి.ఇలా రెడీ చేసుకున్న పిండి చాలా రోజులు వస్తుంది.మనం ప్రతిరోజు రాత్రి గోధుమ రొట్టెకు బదులు వీటిని చపాతీల్లా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.ఇలా చపాతీల్లా కాకుండా ఉదయం పూట జావలాగా,చేసుకుని తాగోచ్చు. అంతే కాదు ఈ పిండితో దోసెలు కూడా వేసుకోవచ్చు.మధ్యాహ్నం రైస్ కి బదులు సంగటి లా కూడా ప్రిపేర్ చేసుకుని తినవచ్చు.ఇలా రకరకాలుగా ఈ పిండిని ఉపయోగించుకోవచ్చు.మరి మీరు కూడా ఇలా హెల్తీ గా ఉండే పిండిని ప్రిపేర్ చేసుకుని తినడం అలవాటు చేసుకోండి.దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరి చేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి: