మనిషి జీవన విధానంపై తన ఆలోచనలు, అలవాట్లు, పరిస్థితులు ఎంతగానో ప్రభావితం చూపుతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనుషుల ఆలోచనను బట్టి అతని జీవన విధానంలో కూడా మార్పు వస్తుంది. అంటే ఇక్కడ మనం ఒక్క విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మనిషి లో ఉన్న విభిన్న రకాల ఆలోచనలు, పరిస్థితులు పలు రకాల వృత్తులను ఎంచుకోవడానికి ఆసక్తి కలుగుతుంది. ఇలా కలిగిన ఆసక్తి వారిని ఆ విభిన్న రకాల పనులపై ఆత్రుత కలిగిస్తుంది.



సరిగ్గా ఇదే కోవకు చెందినదే ఈ పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ కథ. హైదారబాద్ కి చెందిన ట్రాఫిక్ పోలీస్ జావిద్ ఖాన్ తన కుటుంబాన్ని నడుపుకోవడానికి పగలు పోలీస్ గా రాత్రి ఆటో డ్రైవర్ గా రాణిస్తున్నాడు. తన పిల్లల విద్య కోసం, తన పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్న ఆ తండ్రి వారికోసమే ప్రత్యేకంగా రాత్రి ఆటో డ్రైవర్ గా మారాడు. పోలీస్ కానిస్టేబుల్ అయినా జావిద్ ఖాన్ చాలా నిజాయితీ ఉన్న కానిస్టేబుల్ గా పేరు తెచ్చుకున్నాడు.


Image result for ktr

అయితే దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో అందరూ ఈయన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ విషయం గురించి తెలుసుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయం పట్ల స్పందిస్తూ పిల్లల చదువు కోసం తండ్రి పడుతున్న కష్టానికి హాట్సాఫ్ తెలుపుతూ.. తన పిల్లల చదువుకు సంబంధించినంత వరకు ప్రభుత్వం భరిస్తుందని భరోసా కల్పించడమే కాకుండా ఆయన్ని ప్రత్యక్షంగా కలుస్తానని మాట సైతం ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: