అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం "పుష్ప పార్ట్ 2" మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది. 

దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ లోని మొదటి పాటకు సంబంధించిన ప్రోమోను ఇప్పటికే ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. అలాగే ఈ సినిమా లోని పుష్ప పుష్ప అంటూ సాగే మొదటి పాటను మే 1 వ తేదీన సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే తాజాగా మరోసారి ఈ సినిమాలోని పుష్ప పుష్ప అంటూ సాగే మొదటి సాంగ్ ను మే 1 వ తేదీన సాయంత్రం 5 గంటల 04 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఈ మూవీ బృందం అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

ఇందులో అల్లు అర్జున్ అదిరిపోయే లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫెజిల్ విలన్ పాత్రలో కనిపించనుండగా ... అనసూయ , సునీల్ , రావు రమేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa