మీకు కనిపించేది నిజం కాకపోవచ్చు.. కనిపిస్తుంది కదా అంటారా.. అలాగే మీకు వినిపించేదీ నిజం కాకపోవచ్చు.. వినిపిస్తోంది కదా అనకండి.. ఎందుకంటే.. ఒక నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్టే.. ప్రతి సంఘటన వెనుకా.. బొమ్మ బొరుసులా.. రెండు కోణాలు ఉంటాయి. మీరు చూస్తున్నది..మీకు కనిపిస్తున్నది ఒక కోణం మాత్రమే.

 

 

అందుకే ఏదైనా విషయం తెలియగానే వెంటనే ఆవేశపడిపోకండి.. వేగంగా నిర్ణయాలు తీసుకోకండి.. ద్వంద్వాలతో నిండిన ప్రపంచంలో జీవిస్తున్న మనిషికి చిత్తశుద్ధి అవసరం. ఎరుకతో జీవించడమెలాగో నేర్చుకోవాలి. నాణేనికి బొమ్మ బొరుసూ ఉంటాయి. మనిషి అన్నీ తనకు అనుకూలంగా ఉండాలని ఆశపడటం సహజం.

 

 

మన మనస్సు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉన్న వైపు మాత్రమే ఆలోచిస్తుంది.. మనకు అనుకూలంగా ఉన్న విషయాలనే స్వీకరిస్తుంది. ఇక్కడే మనిషి విచక్షణ ఉపయోగించాలి. ఆ ఘటన అలా ఎందుకు జరిగి ఉంటుందో.. రెండో కోణం కూడా ఆలోచించగలగాలి. అప్పుడే దాగి ఉన్న అసలు నిజం మీకు కనిపిస్తుంది.

 

 

మనిషి సదాలోచనలు, సహనమే ఆ విధిని అనుకూలంగా మార్చుకోవడంలో తోడ్పడతాయి.మనిషికి సరైన వైఖరి, విశ్వాసం ఉంటే నిస్సహాయ పరిస్థితుల్లో సైతం అత్యద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. సహనం నిండుగా ఉంటే దైవబలంతోడై కొండలను సైతం కదిలించవచ్చునని గ్రహించాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: