జీవితాన్ని జాగ్రత్తగా లీడ్ చేయాలి.. ప్రతి ఒక్కటీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధ ఉండకూడదు.. ఇలాంటివన్నీ చిన్ననాటి నుంచి మనం వింటూనే ఉంటాం. అయితే ఈ జాగ్రత్త చాలాసార్లు కొంప ముంచుతుంది కూడా. అవును. జీవితాన్ని జాగ్రత్తగానే లీడ్ చేయాలి. అయితే అది మన ఆనందాన్ని హరించ కూడదు.

 

 

చాలామంది జీవితంలో పొదుపు పాటిస్తారు. ముందు చూపుతో వ్యవహరిస్తారు. భవిష్యత్ కోసం చాలా కష్టపడతారు. ఎంతగా అంటే 24 గంటల్లో నిద్రపోవడం మినహా మిగిలిన సమయం అంతా బిజీ బిజీగా సంపాదనలో గడిపేస్తారు. ఇల్లు కొనాలి, కారు కొనాలి, సొసైటీలో బ్రహ్మాండంగా జీవించాలి, పిల్లల కోసం సంపాదించి పెట్టాలి.. ఇలా ఎంతో తపన పడతారు.

 

 

కానీ ఈరేసులో ఒక్క విషయం మాత్రం మరిచిపోతారు. ఏ భవిష్యత్ కోసం తాము కష్టపడుతున్నారో.. జీవితాంతం ధారపోస్తున్నారో.. ఆ రేపటి వరకూ మనం ఉండకపోతే.. అప్పుడు మన జీవితకాల శ్రమ వృథాయే కదా. అందుకే జీవితాన్ని అనుభవిస్తూ ముందుకు సాగాలి.

 

 

జీవితంలో ముందు చూపు ఎంత ముఖ్యమో.. ప్రస్తుతం కూడా అంతే ముఖ్యం. ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ ముందుకుపోవాలి. ఈరోజే ఆఖరి రోజు అయితే మీరు ఏం చేస్తారో ఆలోచించుకుని.. అలాగే ముందుకు వెళ్లాలి. రేపటి కోసం ఆలోచిస్తూ.. ఈరోజును వృథా చేయకండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: