జీవితం చాలా విచిత్రమైంది. కొన్ని సార్లు అసలు మనకు ఇష్టం లేకుండానే కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. తీరా ఆ పని చేశాక.. అసలు నేనేనా ఈ పని చేసింది అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. ఆ పని మనకు పూర్తిగా భిన్నమైంది. మన స్వభావానికి పూర్తిగా విరుద్ధమైంది. కానీ మరి ఆ పని మనం ఎందుకు చేసి ఉంటాం..?

 

 

ఈ ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేం.. ఎందుకంటే.. దాన్ని విధి అని అనాలేమో.. అదేంటి చేసింది మీరేగా.. మీ నియంత్రణ లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నించవచ్చు. కానీ.. కాలం, ఖర్మం కలసి రానప్పుడు అలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. ఇందుకు పురాణాల్లోనూ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి.

 

 

మహాభారతంలో ధర్మరాజు తెలుసుకదా. ఆయన ఎన్నడూ ధర్మం తప్పనివాడు. అసలు మనిషి ఎలా ధర్మబద్దంగా బతకాలో చెప్పేందుకు ఆయన ఓ ఉదాహరణ. కానీ అలాంటి వాడు కూడా ఓ బలహీన క్షణంలో కౌరవులతో జూదం ఆడేందుకు సిద్ధపడతారు. ఆ ఒక్క తప్పు చివరకు మహా భారత యుద్ధానికే దారి తీసింది.

 

 

మరి జూదం ఆడకూడదని ధర్మరాజుకు తెలియదా.. ఆడినా భార్యను పణంగా పెట్టకూడదని తెలియదా.. అన్నీ తెలుసు. అందుకే ఇలాంటి తప్పులు మీ జీవితంలోనూ జరగొచ్చు. ఇక జరిగిపోయినా దాన్ని గురించి ఆలోచించకుండా... జరగాల్సింది జాగ్రత్తగా చేయడమే మన పని.

 

మరింత సమాచారం తెలుసుకోండి: