కరోనా రావడం వల్ల అందరి జీవితాలు అతలాకుతలం అయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే కూర్చోవడం వల్ల శారీరక సమస్యలు కూడా వస్తున్నాయి. దాదాపుగా 90 శాతం మంది తమ జీవితంలో ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉన్నది. ఇందులో ముఖ్యంగా నడుము నొప్పి తో బాధపడే వారు చాలా ఎక్కువ మంది చేరారని చెప్పవచ్చు. అయితే వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఇక వీటిని నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉన్నట్లుగా వైద్యులు సూచించారు.

ఇక వీటితోపాటుగా మూత్రపిండాలలో రాళ్లు,  కండరాలకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయని తెలియజేయడం జరిగింది. ఈ వెన్నుపాము సమస్యల వల్లే ఈ నడుము నొప్పి వస్తుందని వైద్యులు సూచించారు. అయితే ఇలాంటి వాటిపై అశ్రద్ధ చేయడం పనికిరాదు. అయితే కొన్ని ఇంట్లోనే చిట్కాలతో ఈ నడుము నొప్పిని దూరం చేసుకోవచ్చు వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం.

1).భోజనం చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే కాస్త లిమిట్ గానే ఆహారాన్ని తీసుకోవాలట. ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయట.

2). అలాగే మీకు సమయం దొరికినప్పుడల్లా కాస్త యోగ, స్పోర్ట్స్, డాన్స్ వంటి వాటికి తమ సమయాన్ని కేటాయించడం మంచిదట. ఇలాంటి వాటి వల్ల మన శరీరంలో ఉండే ఎముకలు దృఢంగా మారడమే కాకుండా కండరాలు కూడా కదులుతాయి.

3). బరువు బాగా ఎత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అట . హఠాత్తుగా ఎక్కువగా కిందికి ఉండడం.. ఏదైనా బరువు ని సడన్ గా ఎత్తడం.. సిగరెట్ అలవాటు ఉన్నవారు ఎక్కువగా స్మోక్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

4). ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కూడా తీవ్రమైన నడుము నొప్పి వస్తుందట.

ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల కచ్చితంగా నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: