చిరుధాన్యాలతో ఎంతో హెల్తీ ఫుడ్ ని తయారు చేసుకోవచ్చు . ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో మిల్లెట్స్ వాడడం పెరుగుతుంది . జొన్నలు మరియు రాగులు ఎక్కువగా టిఫిన్ లోకి వాడుతున్నారు . ఇడ్లీ మరియు దోసెల్లోకి చిరుధాన్యాలు చేర్చుకుని రుచితో పాటు ఆరోగ్యానికి ప్రధానియం ఇస్తున్నారు . ఒబిసిటీ మరియు షుగర్ లాంటివి శాశ్వతమైన వ్యాధులు . వీటిని దరిచేరకుండా చూసుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి . 

జొన్న రొట్టెల తయారీ కేంద్రాలు ప్రతి వీధిలో ప్రత్యక్షమవుతాయి ‌. ఎంతోమంది గ్రామీణ స్త్రీలు పట్టణాల్లో జొన్న రొట్టెల తయారీతో ఉపాధి పొందుతున్నారు . చాలామందికి జొన్న రొట్టెలు తినాలని ఉన్న అవి చేయడం రాక విసుగుతూ పోతారు . అటువంటి వారి కోసమే ఈ వార్త . ఈ వార్తలో జొన్న రొట్టెలు తయారీ విధానం తెలుసుకుందాం . ముందుగా జొన్నలను నీళ్లతో శుభ్రం చేసుకునే రెండు రోజులపాటు ఎండలో ఆరబెట్టుకోవాలి . ఈ ఎండలో తడి ఆరిపోయిన జొన్నలను పిండి పట్టుకుని తెచ్చుకోవాలి . ఇక ఇప్పుడు ఈ పిండితో జొన్న చపాతీలను చేసుకోవచ్చు . ఇవి ఎండలో ఆరబెట్టి మర పట్టించడం వల్ల చాలా రుచిగా ఉంటాయి .

జొన్న పిండి ఒక కప్పు, నీళ్లు ఒక కప్పు , ఉప్పు తగినంత తీసుకోవాలి . అనంతరం జొన్న చపాతీల కోసం ముందుగా ఒక గిన్నెను పొయ్య మీద పెట్టుకొని ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి . అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని నీళ్ళను మరిగించాలి . ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాగా తెర్లగలిగిన నీటిలో ఉప్పు జొన్న పిండి వేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి . కలిపిన పిండిని అలానే గిన్నెలో ఉంచి వేడి తగ్గిన అనంతరం చేతిలోకి తీసుకుని బాగా కలుపుకోవాలి . పిండి ముద్దను పీట మీద రుద్దుతూ కలుపుకోవడం వల్ల బాగా మిక్స్ అవుతుంది . అనంతరం చపాతీలు చేసుకుని .. ఇష్టం ఉన్నవారు ఆయిల్ లో ఇష్టం లేనివారు పాన్ పై కాల్చుకోవచ్చు . ఇలా చేస్తే రుచికరమైన జొన్న చపాతి రెడీ అవుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: