
ఏలకులో ఉండే నేచురల్ ఆయిల్స్ మన నర్వస్ సిస్టమ్ మీద శాంతిదాయకంగా పనిచేస్తాయి. దీని వల్ల డిప్రెషన్, ఆందోళన తగ్గుతుంది. రాత్రి ఇది తీసుకోవడం ద్వారా రిలాక్స్ అయ్యి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఏలకులు హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో సహాయపడతాయి. మహిళలలో మెన్స్ట్రుయల్ సైకిల్ రీగులర్ కావడంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఏలకులో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. వీటివల్ల శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లను నివారించడంలో, దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రిపూట వేసవి వేడి కారణంగా ఒళ్ళు బాగా వేడెక్కినట్లు అనిపిస్తే, ఏలకుల పాలు శరీరాన్ని కూల్ చేసి సౌకర్యంగా నిద్రించేందుకు సహాయపడతాయి.
ఏలకులు సహజంగా డిటాక్సిఫైయింగ్ గుణాలు కలిగివుండటంతో, మూత్రపిండాల్లో ఉండే మలినాలను బయటకు పంపించడంలో సహాయపడతాయి. రాత్రిపూట ఏలకుల పాలను తాగడం వల్ల జీర్ణం బాగుండి, మలబద్ధకం తగ్గి, మెటబాలిజం బాగా పనిచేస్తుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఏలకులు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉండటంతో చర్మంపై ప్రభావాన్ని చూపుతాయి. పాలలోని ప్రోటీన్‌తో కలిపి తీసుకుంటే చర్మం చక్కగా మెరుస్తుంది, ముడతలు ఆలస్యం అవుతాయి. ఏలకులలో ఉండే సహజ నూనెలు నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. దీనివల్ల నోటి దుర్వాసన దూరమవుతుంది, నోటి ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి.