- ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

గ్రేటర్ హైదరాబాదులో రియల్ ఎస్టేట్ తిరిగి గాడిన పడుతోంది. హైదరాబాద్ - మేడ్చల్ - మల్కాజ్గిరి - రంగారెడ్డి - సంగారెడ్డిలలో రిజిస్ట్రేషన్ సంఖ్య రోజురోజుకు బాగా పెరుగుతుంది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే లో దాదాపుగా 14 శాతం పెరుగుదల కనిపించినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది మే లో రంగారెడ్డి జిల్లా 48 శాతం రిజిస్ట్రేషన్లు - మేడ్చల్ , మల్కాజ్గిరి 37% - హైదరాబాద్ జిల్లాలో 15% రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అత్యధిక భాగం రంగారెడ్డి జిల్లా పరిధిలో జరుగుతున్నాయి. ఈ ఏడాది మే లో కోటి అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్రాపర్టీ ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 37% పెరిగాయి. ఇవి మొత్తం రిజిస్ట్రేషన్లలో 19 శాతంగా ఉన్నాయి.


గత సంవత్సరం మే లో కోటికన్నా ఎక్కువ ఉన్న ఆస్తులు రిజిస్ట్రేషన్లు 14 శాతమే ఉన్నాయి. 50 లక్షల కంటే తక్కువ ... 50 లక్షలు నుంచి కోటి మధ్య ధర ఉన్న ప్రాపర్టీలు వరుసగా 55 శాతం 26% రిజిస్టర్ అయ్యాయి. ఇది ఎగువ ... మధ్యతరగతి ప్రజల నుంచి పెరుగుతున్న డిమాండ్ ను సూచిస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలు ... ఎగువ మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు ఇళ్లు కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇంతకాలం వడ్డీ రేట్లు .. ఇతర అనిశ్చితి కారణంగా ఆలోచిస్తూ వచ్చారు. ఇప్పుడు ధరలు నిలకడగా ఉండడంతో అమ్మకాలు కూడా బాగా పుంజుకుంటున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: