సాధారణంగా జంపింగ్ ఎమ్మెల్యేలని ప్రజలు పెద్దగా ఆదరించే పరిస్తితి ఉండదు. ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి మారిపోయే ఎమ్మెల్యేలని మళ్ళీ ప్రజలు గెలిపించడం కష్టం. కానీ ఏ పార్టీలో ఉన్నా సరే ప్రజల కోసం నిలబడే ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవడం సులువే అని చెప్పొచ్చు. ఇక వల్లభనేని వంశీ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు.

వంశీ రాజకీయ జీవితం టి‌డి‌పిలో మొదలైన విషయం తెలిసిందే. టి‌డి‌పి తరుపున 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2019లో జగన్ గాలిలో సైతం మరొకసారి గన్నవరం నుంచి గెలిచారు. కానీ టీడీపీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో అనూహ్యంగా వంశీ...జగన్‌కు మద్ధతు తెలిపారు.

అయితే వంశీ  ఏ పార్టీలో ఉన్నా సరే ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. ఇది సమస్య అని చెబితే చాలు వెంటనే పరిష్కారానికి కృషి చేస్తారు. అలాగే గన్నవరం ప్రజలకు నేరుగా తన ఇంటి వద్దకే వచ్చి సమస్యలు చెప్పుకునే వీలు కల్పించారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉంటూ ఎన్నో ఏళ్లుగా గన్నవరంలో ఉన్న సమస్యలకు చెక్ పెట్టారు. అటు బుడమేరు కాలువపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయ్యేలా చేసుకున్నారు.  

గన్నవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి...సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చేస్తున్నారు. వంశీ మీడియాలో టి‌డి‌పిపై విమర్శలు చేస్తారుగానీ....నియోజకవర్గానికి వచ్చేసరికి పార్టీల పరంగా చూడకుండా పనులు చేస్తారు. ఇలా అన్నిరకాలుగా వంశీ ప్రజలకు సేవ చేస్తున్నారు. అందుకే వంశీ ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన్ని గెలిపించేందుకు గన్నవరం ప్రజలు రెడీగానే ఉన్నారు.

అటు టీడీపీ తరుపున సీనియర్ నేత బచ్చుల అర్జునుడు పనిచేస్తున్నారు. అర్జునుడుకు నియోజకవర్గంలో అంత ఫాలోయింగ్ లేదు...వంశీకి అసలు చెక్ పెట్టలేరు.  అలాగే వైసీపీలో అంతర్గత విభేదాలు కూడా తగ్గాయి. మొత్తానికి చూసుకుంటే గన్నవరంలో వంశీ హ్యాట్రిక్ కొట్టేలా కనిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: