తన అందంతో, స్టైలిష్ లుక్స్ తో, యాక్టింగ్ తో కుర్రకారు మతిని పోగొట్టే అందాల భామ జాక్విలిన్ ఫెర్నాండెజ్. ఈ హీరోయిన్ అగ్ర కథానాయకులతో బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది. అయితే తాజాగా జాక్విలిన్ కు అరుదైన గౌరవం లభించింది. "టైమ్స్ 40 అండర్ 40" జాబితాలో ఆమెకు చోటు దక్కింది. ఈ జాబితాలో చోటు దక్కిన ఏకైక నటి జాక్విలిన్ కావడం విశేషం. జాక్విలిన్ "షెరాక్స్" అనే సంస్థను స్థాపించింది. మహిళలను శక్తివంతంగా తయారు చేయడం, వారందరినీ ఒకటిగా ఉంచడం, మహిళలను ప్రోత్సహించడం లాంటివి ఈ సంస్థ యొక్క లక్ష్యాలు. ప్రతి ఒక్కరిలో ఏదో ఓ టాలెంట్ దాగి ఉంటుంది. వారి శక్తేంటో వారికి తెలియదు. అలాంటి వారిలో దాగి ఉన్న శక్తులను బహిర్గతం చేయడానికి జాక్వెలిన్ ఈ సంస్థను నిర్మించారు. ఆ సంస్థకు డైరెక్టర్ గా జాకీ ఉన్నారు. జాక్విలిన్ ఫిట్ నెస్ తరగతులే ఆమెకు సమాజంలోని గొప్ప వారితో సంబంధాన్ని పెంచాయనే అర్థం చేసుకోవచ్చు. "టైమ్స్ 40 అండర్ 40" జాబితాలో 40 ఏళ్లు పై బడని 40 మంది ప్రభావవంతమైన యువ పారిశ్రామికవేత్తలు, నాయకులు, ఆవిష్కర్తలకు గుర్తింపునిచ్చారు. సమాజంలో గొప్ప మార్పుకు నిజంగా దోహదపడిన వారికే ఈ గుర్తింపు లభిస్తుంది.

జాక్విలిన్ హాలీవుడ్‌ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. అంథాల‌జీ ఉమెన్స్ స్టోరీస్‌ తో హాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానుంది. ఈ సిరీస్ 6 భాగాలుగా రానుంది. మొత్తం ఆరుగురు మహిళా దర్శకులు ఈ సిరీస్ కి సంబంధించిన కథలను తయారు చేయనున్నారు. ఈ సినిమాలో జాక్వెలిన్ ఓ  ట్రాన్స్‌జెండ‌ర్ మోడ‌ల్‌ తో కలిసి నటించింది. గతేడాది అక్టోబర్‌ లోనే ఈ సినిమా  షూటింగ్‌ ను పూర్తి చేశారు. ఈ సినిమా షూటింగ్ ను చాలా వరకు ముంబైలోనే చిత్రీకరించారు. ఈ సినిమాలో జాక్విలిన్ పోలీస్‌ ఆఫీసర్‌ గా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ప్రస్తుతం జాక్విలిన్ బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్టులు ఒప్పుకుంది. ఇప్పటికే రోహిత్ శెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ ను కంప్లీట్‌ చేసుకుంది. జాన్ అబ్రహం, అక్షయ్ కుమార్‌ ల సినిమా షూటింగ్‌ ను కూడా జాక్విలిన్ పూర్తిచేసింది. లాక్‌డౌన్‌ కారణంగా సల్మాన్‌ తో చేస్తున్న కిక్‌-2 సినిమాకు బ్రేక్ పడింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ ను ప్రారంభించనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: