డైరెక్టర్ కృష్ణవంశీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించడంలో ముందు ఉంటారు. అలా తెరకెక్కించిన సినిమాలలో ఖడ్గం సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ముస్లిం, హిందువుల మధ్య స్నేహబంధం గురించి తెలియజేయడం జరిగింది. ఈ సినిమా విడుదల అయ్యాక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగా కూడా బాగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఖడ్గం సినిమాలో హీరోగా శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, రవితేజ, బ్రహ్మాజీ నటించారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి నటన ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.


ఇక ఈ చిత్రానికి గాను నంది అవార్డులతో పాటు ఎంతోమంది ప్రశంసలు కూడా దక్కాయి కృష్ణవంశీకి.ఈ చిత్రంలో సోనాలి బింద్రే, కిమ్ శర్మ, సంగీత హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలోని సంగీత పాత్ర చెప్పాలి అంటే ఈ సినిమాకి చాలా హైలైట్ అని చెప్పవచ్చు. సినిమాల పిచ్చితో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. అంతేకాకుండా ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ.. రవితేజ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఎలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అదే తరహా పాత్రలో నటించినట్లు తెలుస్తోంది.


తర్వాత ఈ చిత్రంలో సంగీతాన్ని హీరోయిన్ చేస్తానని చెప్పి ఒక డైరెక్టర్ ఆమెను నమ్మించి బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లి ఒక సన్నివేశం తెరకెక్కించారు డైరెక్టర్ కృష్ణవంశీ. ఇక సంగీత అమ్మ పాత్రలో నటించిన శ్యామల కూడా తన కూతుర్ని హీరోయిన్ చేయాలనే కోరికతోనే ఆ డైరెక్టర్ దగ్గరకు సంగీతాన్ని పంపిస్తుంది. అలా ఆ డైరెక్టర్ ఒడిలో కూర్చొని మందు తాగిస్తూ ఉంటున్న సమయంలో రవితేజ తలుపు నెట్టుకొని వచ్చి చూడగా ఆ పరిస్థితి చూసి తట్టుకోలేక చాలా విలువిలలాడిపోతారు. అయితే ఈ సినిమాలోని ఈ సన్నివేశం చూసిన అందరూ ఇండస్ట్రీలో ఇలాంటి వి జరుగుతాయని అందరూ అనుకున్నారు. అయితే ఇది తన భార్య అయిన రమ్యకృష్ణని కూడా ఒక డైరెక్టర్ షూటింగ్ సమయంలో ఇలాంటి ఇబ్బంది పెట్టడంతో కృష్ణవంశీ కావాలని ఆ డైరెక్టర్ ని దృష్టిలో పెట్టుకొని ఈ సీన్ పెట్టారని అప్పట్లో వార్తలు వినిపించాయి. మరి ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: